ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ కొన్ని వందల కోట్లతో మంచి వెబ్ సిరీస్ లు తీస్తోంది. అయితే ఇండియాలోనూ అత్యంత బడ్జెట్ తో రూపొందినవి ఉన్నాయి.

దేశంలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ లలో తప్పక చూడవలసిన కొన్ని ఖరీదైన భారతీయ వెబ్ సిరీస్‌లు ఇక్కడ ఉన్నాయి.

హీరమండి: ది డైమండ్ బజార్ సంజయ్ లీలా బన్సాలీ యొక్క 'హీరమండి: ది డైమండ్ బజార్' విలాసవంతమైన సెట్‌లు, ఖరీదైన దుస్తులు, నాణ్యమైన వస్తువులతో రూపొందింది. ఇది అత్యంత ఖరీదైన భారతీయ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.

మేడ్ ఇన్ హెవెన్ ఏక్తా కపూర్ ప్రొడక్షన్ లో వచ్చిన 'మేడ్ ఇన్ హెవెన్' ఖరీదైన వెబ్ సిరీస్ గా ఉంది. ఇది ఉన్నత సంబంధాలు.. వివాహాల వెనుక ఉన్న చీకటిని బహిర్గతం చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ దాదాపు 100 కోట్ల రూపాయలు అని సమాచారం.

సేక్రేడ్ గేమ్స్‌ సేక్రేడ్ గేమ్స్‌లో సైఫ్ అలీ ఖాన్ , నవాజుద్దీన్ సిక్కిలు నటించారు.  వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ మిస్టరీలతో నిండి ఉంది.  ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. మొదటి సీజన్ బడ్జెట్ దాదాపు రూ.40 కోట్లు కాగా, రెండో సీజన్ కు రూ.100 కోట్లకు పెంచినట్లు సమాచారం.

రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అజయ్ దేవగన్ తొలి OTT సిరీస్ రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్. పోలీస్ యూనిఫాం ధరించిన అధికారులను హత్య చేసే మానసిక రోగికి ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా రూపొందిన వెబ్ సిరీస్ నే ‘రుద్ర కథ’. నివేదికల ప్రకారం ఇది 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అత్యంత ఖరీదైన భారతీయ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.

మీర్జాపూర్ 2 ఈ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ వెబ్ సిరీస్ ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో జరిగిన క్రైంకు సంబంధించింది.  ఒక నివేదిక ప్రకారం రెండవ సీజన్ బడ్జెట్ దాదాపు 60 కోట్ల రూపాయలు అని సమాచారం.

ప్రస్తుతానికి ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన వెబ్ సిరీస్ లు ఇవే..

Off-white Banner

Thanks For Reading...