అమెరికా స్పేస్ ఏజెన్సీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) అంతరిక్షం నుండి భూమి పై ఉన్న పలు ఉత్కంఠభరితమైన చిత్రాలను పంచుకుంటుంది. భూమి -దాని ప్రకృతి దృశ్యాల ఈ పది ఫొటోలు  మంత్రముగ్దులను  చేస్తున్నాయి.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) నుండి తీసిన ఈ అందమైన చిత్రం, ఆగ్నేయ ఉటాలో ఎరుపు-గోధుమ రంగు ప్రకృతి దృశ్యంతో కనిపించిన కొలరాడో నదిని చూపిస్తుంది.

ISS నుండి తీసిన ఈ ఫొటో ఉత్తర చాడ్‌లోని ట్రౌ ఓ నాట్రాన్ అనే అగ్నిపర్వత అగాథాన్ని చూపిస్తోంది.

ISS నుండి తీసిన ఈ అద్భుతమైన చిత్రం అరోరా బొరియాలిస్ లేదా భూమిపైకి సూర్యుడి వెలుతురు వస్తున్న అద్భుతమైన చిత్రాలను చూపిస్తోంది..

ఏప్రిల్ 2023లో ల్యాండ్‌శాట్ 8 ద్వారా తీసిన ఈ ఉపగ్రహ చిత్రం దక్షిణ-మధ్య వాషింగ్టన్‌లోని గుండె ఆకారంలో ఉన్న స్పిరిట్ సరస్సును చూపుతుంది.

ఈ మంత్రముగ్దులను చేసే చిత్రం అపోలో 8 ఉపగ్రహం తీసింది.. చంద్రుని ఉపరితలం నుండి భూమి చిత్రాన్ని చూపిస్తుంది.

ISSలో ఉన్న వ్యోమగాములు సెప్టెంబరు 29, 2021న అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళుతున్నప్పుడు శక్తివంతమైన తుఫాను సామ్ హరికేన్‌ను ఫొటోగా తీశారు.

మే 2022లో ల్యాండ్‌శాట్-8 ద్వారా  తీసిన ఈ చిత్రం దక్షిణ పసిఫిక్‌లోని అతి చిన్న వయసున్న అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ బగానాను బంధించింది.

ఈ ఉత్కంఠభరితమైన చిత్రాన్ని ల్యాండ్‌శాట్ 7 తీసింది. బహామాస్‌లోని అలలు మరియు సముద్ర ప్రవాహాలను కలిగి ఉంది.

ఈ ఉపగ్రహ చిత్రం తూర్పు గ్రీన్‌ల్యాండ్‌లోని విస్తారమైన మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య సోర్టెబ్రే హిమానీనదాన్ని చూపుతుంది.

ISS నుండి తీసిన ఈ చిత్రం మంచుతో కప్పబడిన దక్షిణ ఆల్ప్స్ సముద్రం మీదుగా తెల్లటి మేఘాల గుండా వెళుతున్నట్లు చూపిస్తుంది.

Off-white Banner

Thanks For Reading...