https://oktelugu.com/

Viral Video : లేచిన ఘడియ బాగుంది కాబట్టి సరిపోయింది.. లేకుంటే చిరుత పులికి ఆహారమయ్యేవాళ్ళు… వీడియో వైరల్

వాళ్లు లేచిన ఘడియ బాగుంది. వచ్చిన వేళా విశేషం ఇంకా బాగుంది. లేకుంటే.. ఈ సమయానికి మీడియాలో వాళ్ల పేర్లు హెడ్లైన్ లలో ఉండేవి. వార్తాపత్రికల్లో ఫోటోలు ప్రచురితమయ్యేవి. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 8, 2024 / 07:00 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video :  ఉత్తర కర్ణాటక రాష్ట్రం అడవులకు ప్రసిద్ధి. ముఖ్యంగా బన్నేరుఘట్ట అనే ప్రాంతం దట్టమైన అడవులకు నిలయం. ఆ ప్రాంతంలో 365 రోజులూ సంచరిస్తూ ఉంటారు. అడవి అందాలను వీక్షిస్తూ ఉంటారు. అసలే ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి ఆ ప్రాంతం రద్దీగా ఉంటున్నది. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకుల బృందం ప్రత్యేకమైన బస్సులో వచ్చింది. ఆ బస్సులో వారు ఆ ప్రాంతంలో అందాలను వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అక్కడి జాతీయ పార్కులో ఆ పర్యాటకులకు అనుకోని సంఘటన ఎదురైంది. ఆ పర్యటకులు ప్రయాణిస్తున్న బస్సు కిటికీ నుంచి లోపలికి ఎక్కేందుకు ఒక చిరుత పులి ప్రయత్నించింది. ఆ దృశ్యాన్ని చూసిన పర్యటకులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఆ తర్వాత భయంతో కేకలు వేశారు. కొంతసేపు బస్సులోకి ఎక్కడానికి ప్రయత్నించిన ఆశ్రిత పులి తర్వాత తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆ తర్వాత అది తన మార్గం వైపుగా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. దీనిని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుంది.

    ఇదే తొలిసారి కాదు

    బన్నేర్ ఘట్ట ప్రాంతం దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం భిన్నంగా ఉంటుంది. రకరకాల జంతువులు.. క్రూర మృగాలు ఉంటాయి. అందువల్ల ఈ ప్రాంతాన్ని చూసేందుకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం దసరా సెలవులు ఇవ్వడంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనంలోకి చిరుత పులి ఎక్కడానికి ప్రయత్నించి.. తన ప్రయత్నాన్ని విరమించుకుంది.. బస్సులో ఎక్కడానికి విఫల ప్రయత్నం చేసిన చిరుత పులి… ఆ తర్వాత అడవిలోకి వెళ్ళింది. గతంలో పర్యాటకుల వాహనంలో ప్రవేశించేందుకు ఓ పెద్దపులి ప్రయత్నించింది. ఆ తర్వాత పర్యాటకులు కేకలు వేయడంతో అది భయపడి పారిపోయింది. ఇక ఏనుగుల మంద.. తోడేళ్ళ మంద గతంలో పర్యాటకుల వాహనాలకు అడ్డు తగిలిన సంఘటనలు చాలా వరకు చోటుచేసుకున్నాయి.

    ఇటీవలి కాలంలో..

    ఇటీవల రోడ్ల మీదకు చిరుతపులులు రావడం ఈ ప్రాంతంలో సర్వసాధారణమైంది. అందువల్లే వచ్చే పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని అటవీ శాఖ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల పర్యాటకులు తినుబండారాలను రోడ్లమీద వేస్తుండడంతో జంతువులు ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది చికెన్ బిర్యాని ప్యాకెట్లు కూడా వేయడం వల్ల కొన్ని రకాల నక్కలు.. తోడేళ్లు రోడ్లమీదకి వస్తున్నాయి. దీంతో అవి పర్యాటకుల మీద దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నాయి. అయితే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.