Ambati Rambabu vs Police : రాజకీయ నాయకులకు కప్పం కట్టిన తర్వాత దానిని ఎలా వసూలు చేసుకోవాలో పోలీసులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఓపెన్ గా జరిగేదే. ఇదంతా బయటకు తెలిసినప్పటికీ అటు రాజకీయ నాయకులు నోరు విప్పరు. పోలీసులు బయటకు చెప్పరు. ఇలాంటి వాళ్లు శాంతిభద్రతలు ఎలా కాపాడుతారు.. ఇలాంటి నాయకులు మెరుగైన సమాజం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది నేతిబీర సామెత లాంటిది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనధికారిక అంగరక్షణ వ్యవస్థగా మారిపోయింది. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు పోలీసులు వినే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీల నాయకులపై.. ఇతర వ్యక్తులపై జులుం ప్రదర్శించడం మొదలైంది. ఇక ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలో ఉంది కాబట్టి.. పోలీస్ వ్యవస్థ ఎవరికోసం పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మొన్నటిదాకా అధికారాన్ని అనుభవించి.. పోలీసులతో అన్ని పనులు చేయించుకున్న వైసిపి నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు. ఏ పోలీసులతో అయితే సెల్యూట్ కొట్టించుకున్నారో.. వారి నోటితోనే తిట్లు తింటున్నారు. ఇలాంటి అనుభవం ఇటీవల వైసిపి నాయకులకు తరచుగా ఎదురవుతోంది.
Also Read : తుని రైలు దగ్ధం కేసు – కీలక పరిణామాలు.. రాజకీయ సంచలనం
ఇటీవల సిదిరి అప్పలరాజు అనే మాజీమంత్రికి ఓ పోలీసు ఉన్నతాధికారికి వాగ్వాదం జరిగింది. ఓ విషయంలో అప్పలరాజు, పోలీసు ఉన్నతాధికారి పరస్పరం తిట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో ప్రముఖంగా కనిపించింది. ఇక ఆ తర్వాత విడదల రజిని, సీఐ మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాను షేక్ చేసింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే.. రజని అడ్డుకున్నారు. చివరికి సీఐ జోక్యం చేసుకోవడంతో ఆమె అడ్డు తగిలారు.. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్త రచ్చ రచ్చ అయిపోయింది. ఇప్పటికి పోలీసులు అదుపులోనే విడదల రజిని అనుచరుడు ఉన్నాడు.. ఇక బుధవారం ఏపీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినాన్ని వైసీపీ నిర్వహించింది. ఇందులో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబటి రాంబాబు రెచ్చిపోయారు. అంబటి రాంబాబును అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆయనకు వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో రాంబాబు పరుష పదజాలం వాడగా.. పోలీసులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. మీదికి వస్తున్నావ్ ఏంటి.. అని అంబటి రాంబాబు ప్రశ్నించగా.. పళ్ళు కొరుకుతున్నావేంటి అని పోలీసు అధికారి ఆయనను తిరిగి ప్రశ్నించారు. మొత్తంగా ఈ వ్యవహారం హాట్ హాట్ గా సాగింది. ఇరు వర్గాలు ఏమాత్రం తగ్గకుండా ఆరోపణలు చేసుకోవడంతో.. అక్కడ వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను టిడిపి అనుకూల సోషల్ మీడియా విభాగం వారు తెగ సర్కులేట్ చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నాయకులు పోలీసులు తమపై అకారణంగా దాడులకు పాల్పడుతున్నారంటూ తమ కోణంలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా పోలీసులు వర్సెస్ వైసీపీ నాయకుల వ్యవహారం ఏపీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక మన్ముందు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
పళ్లు కొరుకుతున్నావ్ ఏంటిరా బలిసిందా? ఇది నీ రౌడీ రాజ్యం కాదు.. ఈ పోలీస్ ఎవరో కానీ అంబటికి గట్టిగా వాయించాడు..@APPOLICE100 pic.twitter.com/nnWsWi573K
— Swathi Reddy (@Swathireddytdp) June 4, 2025