Sai Pallavi Sister Pooja Kanna: టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి గురించి తెలియని వారుండరు. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత బడా హీరోల పక్కన నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నా.. తన సోదరి పూజ పెళ్లిలో హడావుడి చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె వివాహ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆమె దగ్గరుండీ పనులు చక్కబెడుతోంది. ఈ సందర్భగా సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.
సాయి పల్లవి కి ఓ సోదరి ఉన్న విషయం అందరికీ తెలిసింది. ఇద్దరూ దాదాపు సేమ్ టు సేమ్ అన్నట్లుగా ఉంటారు. ఒక దశలో వీరిద్దరు పక్కపక్కనే ఉంటూ ఎవరూ ఎవరనేది గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. అయితే ఇటీవల సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ వినీత్ తో కలిసి వివాహం చేసుకోనుంది. ఇటీవల వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా డ్యాన్స్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
నిశ్చితార్థం పూర్తి కాగానే సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ మాస్ స్టెప్పులు వేసింది. సాయిపల్లవి డ్యాన్స్ లో ఇరగదీస్తుందని అన్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలో ఆమె డ్యాన్స్ తో ఆకట్టుకున్నాయి. ‘ఎంసీఏ’ అనే సినిమాలో హీరో నానికి పోటీగా సాయిపల్లవి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. అయితే అక్కకు మించి అన్నట్లుగా పూజ కన్నన్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. అదీ పెళ్లి కూతురు డ్రెస్ వేసుకొని ఇలా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకర్షింది.
పూజ కన్నన్ తో పాటు ఆమెకు కాబోయే భర్త వినీత్, సాయి పల్లవి,మరి కొంత మంది కుటుంబ సభ్యులు సైతం డ్యాన్స్ చేస్తూ సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. అయితే పూజ కన్నన్ ఇలా డ్యాన్స్ చేయడంపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అక్కకు మించిన డ్యాన్స్ చేశావంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి..
View this post on Instagram