Ganga River Flood : ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మేఘాలు దట్టంగా అలముకొని విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న నదులు బీభత్సంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గంగా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. గంగా నది పరివాహకంలో ఉన్న ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోయాయి. పంట పొలాలు నీటిలో తేలియాడుతున్నాయి. గంగా నదికి వచ్చిన వరదల వల్ల రైతులకు తీవ్రంగా నష్టపోయారు. రోడ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో హరిద్వార్ ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన సంచలనం సృష్టించింది.
హరిద్వార్ ప్రాంతంలో కొద్దిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల అక్కడ ప్రవహించే గంగానదికి విపరీతంగా వరద వస్తున్నది. వరద నీరు వస్తున్న నేపథ్యంలో గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఆ ప్రవాహంలో అతడు కొట్టుకుపోతుండగా ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది స్పందించారు. గంగా నది ప్రవాహం లో అతడు కొట్టుకుపోతుండగా వెంటనే అందులోకి దూకారు. లైవ్ జాకెట్స్ వేసుకొని అతడిని కాపాడారు.. బోటులోకి తాడు సహాయంతో అతడిని అందులోకి ఎక్కించారు. ఆ తర్వాత అతడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడే ఉన్న భక్తులలో కొంతమంది ఈ దృశ్యాలను మొత్తం వీడియో తీశారు. దీనిని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది..
” గంగానది ప్రవాహం బీభత్సంగా ఉంది. అందులో అతడు ప్రమాదవశాత్తు పడ్డాడు. ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నాడు. అప్పటికే అతడికి భూమ్మీద నూకలు అయిపోయాయని అనుకున్నాం.. కానీ ఇంతలోనే దేవుళ్ళ మాదిరిగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు. మరో మాటకు తావు లేకుండా ప్రవహిస్తున్న నదిలో దూకారు. అతడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఒక తాడు సహాయంతో అతడిని బోటు దాకా తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి ప్రవాహానికి వ్యతిరేకంగా బోటు నడిపి ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. చూస్తుంటే ఈ దృశ్యం గగుర్పాటుకు గురిచేసింది. అసలు అంతటి ప్రవాహ వేగంలో అతడు బతకడమే గొప్ప విషయమని” నెటిజన్లు పేర్కొంటున్నారు..కాగా, గంగా నదికి పూజలు చేసే క్రమంలో అతడు ఒక్కసారిగా కాలుజారి నదిలో పడ్డాడని.. ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడని స్థానికులు అంటున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి అతడిని కాపాడారని స్థానికులు చెబుతున్నారు.
గంగానది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని ఇక్కడ నియమించారు. ప్రమాదవశాత్తు ఎవరైనా నదిలో పడితే వారిని కాపాడేందుకు వీలుగా ఉంటుందని వారిని నియమించారు.. వారిని నియమించడం వల్ల ఆ వ్యక్తిని కాపాడేందుకు వీలైందని స్థానికులు అంటున్నారు. మరి కొద్ది రోజులపాటు ఆ సిబ్బంది ఇక్కడే సేవలు అందించాలని.. నదిలో పడిపోయిన వారిని కాపాడాలని స్థానికులు ఈ సందర్భంగా కోరుతున్నారు.