Conjoined Twins Marry: అమెరికాలో అరుదైన వివాహం జరిగింది. రెండు తలలు ఉన్న అమ్మాయిని ఓ ఆర్మీ అధికారి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయికి తలలు రెండు ఉంటాయి. కానీ శరీరం ఒక్కటే ఉంటుంది. వీరి వివాహం 2021లోనే జరిగింది. అయితే తాజాగా వీరు డ్యాన్స్ చేస్తున్నవీడియో బయటకు రావడంతో వారి గురించి ప్రపంచానికి తెలిసిపోయింది. దీంతో వీరికి సంబంధించిన న్యూస్, వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
1996లో ‘ది ఓప్రా విన్ ష్రే’ అనే షో ద్వారా రెండు తలలు ఉన్న ఈ అమ్మాయికి పాపులారిటీ వచ్చింది. హబ్బి, బ్రిటనీ హన్సెల్ అనే పేరున్న ఈమెకు యూఎస్ ఆర్మీ అధికారి వెటరన్ జోష్ తో బౌలింగ్ తో వివాహం జరిగింది. ఈ విషయాన్ని పీపుల్స్ మ్యాగజైన్ బయటకు తెచ్చింది. వీరు తమ వివాహం సందర్భంగా చేసిన డ్యాన్స్ వీడియో బయటకు రావడంతో ఈ కపుల్స్ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఈ కవలలు 1990లో జన్మించారు. పాటీ, మైక్ హెన్సెల్ అనే దంపతులకు వీరు జన్మించారు. ముందుగా వీరు జన్మించే క్రమంలో తల్లికి ప్రాణ గండం ఉందని వైద్యులు చెప్పారు. అయినా వీరి జన్మను తల్లిదండ్రులు స్వాగతించారు. ఆ తరువాత కవలలు జన్మించిన తరువాత బతికే అవకాశాలు తక్కువే అన్నారు. కానీ ప్రస్తుతం వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతీ 2 లక్షల జననాల్లో ఒక జననం కవలలు ఉంటారని, వీరిలో ఎక్కువగా ఆడవాళ్లే ఉంటారని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా చాలా వరకు కవలలు చనిపోయారన్నారు.
View this post on Instagram