Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ గెలవబోతోంది.. బీజేపీ ఓడిపోతోందని తెలిపాయి. జనతాదళ్ కింగ్ మేకర్ అంటూ ప్రకటించాయి. సర్వేలన్నీ ఎన్నికల ముందే చెప్పేస్తున్నాయి. కానీ ఇంకా ఎలక్షన్స్ కు సమయం ఉంది. ఇప్పుడే సర్వేలు చెప్పే టైం ఆసన్నమైందా? అన్నది కర్ణాటకలో చూడాలి.
కర్ణాటక ఎన్నికలు చూస్తే అందరూ అంచనాలను బట్టి వెలువరుస్తున్నారని అర్థమవుతోంది. ఇక క్రెడిబిలిటీ ఉన్న ‘యాక్సిస్ మై ఇండియా’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలు నూటికి నూరుపాళ్లు నిజమయ్యాయి. ప్రదీప్ గుప్తా చాలా నిక్కచ్చగా సర్వేలు ఇస్తాడని పేరుంది.
కర్ణాటక వైవిధ్యభరితమైన సమాజం. ప్రాంతాల వారీగా ఆలోచనలు మారిపోతున్నాయి. ఓల్డ్ మైసూర్ లోని ఆలోచనలు, కోస్తా కర్ణాటకలో.. హైదరాబాద్, ముంబై కర్ణాటక ప్రాంతాలు విభిన్నంగా వినూత్నంగా ఉంది. ఒక్కతాటిపైకి అన్ని ప్రాంతాలు రావడం లేదు.
కర్ణాటకలో రకరకాల ప్రాంతాలను బట్టి పరిస్థితులు మారుతున్నాయి. సర్వేలు కూడా ఇక్కడ నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నాయి. బెంగళూరులో 40 శాతం మాత్రమే కన్నడిగులు ఉంటారు. ఇక రాష్ట్ర జనాభాలో మూడింట రెండు వంతులే కన్నడిగులు ఉన్నారు. మిగతా భాషలు మాట్లాడేవారు కూడా కర్ణాటకలో కీలకంగా ఉన్నారు. వారి ఓట్లు పార్టీల వారీగా మారిపోయాయి.
కర్ణాటక ఎన్నికలు సెఫాలిజిస్టులకు పెద్ద సవాలుగా చెప్పొచ్చు. కర్ణాటకలోని పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.