https://oktelugu.com/

Refrigerator Alert: ఈ తప్పులు చేస్తున్నారా అయితే మీ ఫ్రిడ్జ్ పేలుతుంది

ఫ్రిజ్‌ విషయంలో ఈ తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచిస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్నిసార్లు ఫ్రిజ్‌లు పేలుతూనే ఉన్నాయి.

Written By: , Updated On : February 19, 2024 / 09:55 AM IST
The fridge will explode
Follow us on

Refrigerator Alert: ఫ్రిజ్‌ ఇప్పుడు నిత్యావసర వస్తువు. ఇళ్లలోనే కాదు దుకాణాలు.. బేకరీలు.. చివరకు చిన్న పాన్‌ డబ్బాల్లో కూడా ఫ్రిజ్‌ కామన్‌ అయింది. ప్రిజ్‌ ఇంట్లో ఉండడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నిత్యావసర వస్తువు అయిన ఫ్రిజ్‌ మెయింటనెన్స్‌ విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో ఇటీవల ఫ్రిజ్‌లు పేలుతున్నాయి.

ఈ తప్పులు చేయకండి..
ఫ్రిజ్‌ విషయంలో ఈ తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచిస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్నిసార్లు ఫ్రిజ్‌లు పేలుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం కంప్రెషర్‌. ఫ్రిజ్‌ వెనుకభాగంలో ఉండే ఈ కంప్రెషర్‌ కాయిల్‌ ద్వారానే కూలింగ్‌ గ్యాస్‌ ఫ్రిజ్‌లోకి వస్తుంది. అయితే ఈ కంప్రెషర్‌ కూడా చల్లగా ఉండాలి. ఇది నిత్యం వెడెక్కుతుంది. దీంతో వాయివు పెరిగి ఒత్తిడికి లోనవుతుంది. అందుకే కాయిల్‌ తరచూ శుభ్రం చేయాలి. కంప్రెషర్‌కు గాలి ఆడేలా చూసుకోవాలి. ఫ్రిజ్‌ను గోడకు ఆనించి ఉంచడం వలన కూడా పేలే అవకాశం ఉంటుంది.

ఆరు అంగుళాల దూరం ఉండాలి..
ఇక ఫ్రిజ్‌ను గోడకు ఆనించకుండా ఉండాలి. కనీసం 6 అంగుళాల దూరం ఉండాలి. ఇలా చేయడం వలన వేడి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. హీట్‌ బయటకు పోనప్పుడు కూడా కంప్రెషన్‌ పేలిపోతుంది. ఫ్రిజ్‌ వెనుక కూడా డస్ట్‌ పేరుకుపోకుండా చూసుకోవాలి. వాటర్‌ లీకేజీలను తేలికగా తీసుకోకుండా మరమ్మతులు చేయించాలి.

పవర్‌ సరఫరాలో లోపాలు..
ఇక ఫ్రిజ్‌కు పవర్‌ సరఫరాలో కూడా లోపాలు లేకుండా చూసుకోవాలి. హెచ్చు తుగ్గలు ఉన్నా కూడా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఫ్రిజ్‌ పేలే అవకాశం ఉంటుంది. అందేకే పవర్‌ డివైస్‌లను తరచూ చెక్‌చేయాలి. ఎనిమిదేళ్ల తర్వాత ఫ్రిజ్‌ పేలే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫ్రిజ్‌లో సౌండ్‌ వస్తున్నా.. అది ప్రమాదకరంగానే భావించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే మెకానిక్‌ను సంప్రదించాలి. ఏదైనా ప్రమాదం ఉందనిపిస్తే వెంటనే ప్లగ్‌ ఆఫ్‌ చేసి విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేయాలి.