Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ భాస్కర్ ఇంస్టాగ్రామ్ లో సంచలన వీడియో పోస్ట్ చేశారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పీటల మీద నుండి పారిపోయిందని చెప్పి షాక్ ఇచ్చాడు. రాజ్ తరుణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో రాజ్ తరుణ్… చిన్నప్పటి నుండి అమ్మాయిలకు దూరంగా బ్రతికాను. నా ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతుంటే నేనేమో అమ్మకు కొత్తిమీర, కరివేపాకు తేవడానికి తిరిగేవాడిని. మనకు లవ్వూ గివ్వూ సెట్ కావని డిసైడ్ అయ్యాను.

నా కరువు చూసి అమ్మానాన్నలు ఓ అమ్మాయితో పెళ్లి సెట్ చేశారు. పెళ్లి అనగానే ఘనంగా వేడుకలు, మండపాలు, పెళ్లి తర్వాత జరిగే శోభనం అన్నీ ఊహించుకున్నాను. పట్టుబట్టలు కట్టుకుని పెళ్లి పీటలపై కూర్చున్నాను. పంతులు మంత్రాలు చదువుతున్నాడు. పెళ్లి కూతురిని తీసుకురండి అని పంతులు గారు చెప్పారు. పెళ్లి కూతురు చెల్లి ఒక ఉత్తరంతో వచ్చింది. అమ్మాయి ఉత్తరం రాసి పారిపోయిందని క్లారిటీ వచ్చింది.
పెళ్ళికి వచ్చిన బంధువులు వెటకారాలతో చంపేశారు. ఏదో సామెత చెప్పినట్లు మొగుడు పోయి ముండ ఏడుస్తుంటే రంకు మొగుడొచ్చి రాళ్ళ్లేసినట్లు ఉంది పరిస్థితి. చచ్చిన పామును ఇంకా చంపుతున్నారు. నన్ను మోసం చేసిన దాన్ని వదలను . ఆ అమ్మాయి అంతు చూస్తాను.దాని ఫోటో ఆన్లైన్లో పెడతాను. మీకు కూడా కనిపిస్తే నాకు చెప్పండి… అంటూ తన ఆవేదన వెళ్లగక్కాడు.

రాజ్ తరుణ్ చేసుకోవాల్సిన అమ్మాయి పెళ్లి రోజు పారిపోయిందని సదరు వీడియో సారాంశం. అయితే ఇది తన కొత్త మూవీ ప్రమోషన్ కోసమని క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ మధ్య కుర్ర హీరోలకు ఇది అలవాటుగా మారింది. చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేసి వాళ్ళ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేలా చేస్తున్నారు. విశ్వక్ సేన్, నందు వంటి హీరోలు ఈ టెక్నిక్ నే వాడారు. ఒక్క హిట్ అంటూ తపన పడుతున్న తరుణ్ కి ఈ కొత్త ప్రాజెక్ట్ అయినా విజయం అందిస్తుందేమో చూడాలి.
View this post on Instagram