Richa Pallod: రిచా పల్లాడ్.. తెలుగు ప్రేక్షకులు ఈ పేరును మర్చిపోయి ఉండొచ్చు. కానీ, ఆమె నటించిన పాత్రలను మాత్రం వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అప్పట్లో ‘నువ్వే కావాలి’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఆ సినిమా అంత గొప్ప విజయం సాధించడానికి ముఖ్య కారణాల్లో రిచా పల్లాడ్ కూడా ఒకరు. అయితే, ‘నువ్వే కావాలి’ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. రిచాకి మాత్రం ఆ తర్వాత కాలం కలిసి రాలేదు.

హీరోయిన్ గుర్తింపు అయితే వచ్చింది గానీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. రిచా పల్లాడ్ గొప్ప అందగత్తె ఏమి కాదు. పైగా ఆమెకు లౌక్యం కూడా తెలియదు. పైగా దర్శకనిర్మాతలతో టచ్ లో కూడా ఉండదు. అందుకే, భారీ విజయం వరించినా.. అది ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అన్నిటికీ మించి రిచా వ్యక్తిత్వం కూడా ఆమె సినిమా కెరీర్ కి మైనస్ అయింది. రిచా పబ్లిక్ లో కనిపించడానికి ఎక్కువ ఆసక్తి చూపించదు.

రిచా బెంగళూరులో పుట్టి పెరిగింది. అయితే రిచా చిన్నతనం నుంచే మంచి నేర్పరి. ఆమెకు ఇతర భాషల్లో కూడా మంచి పట్టు ఉంది. అందుకే తెలుగులో అవకాశాలు తగ్గాయి అని అర్ధమవ్వగానే వెంటనే ఇతర ఇండస్ట్రీ లకు షిఫ్ట్ అయిపోయింది. ఇతర భాషల్లో కూడా అడపాదడపా సినిమాలు చేసినా.. అక్కడ కూడా హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ముఖ్యంగా ఆమెను సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే చూశారు మేకర్స్.
దాన్ని ‘రిచా’ జీర్ణయించుకోలేకపోయింది. అందుకే నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంటున్న సమయంలో ఆమెకు వచ్చిన సినిమా ‘కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహే’. ఈ సినిమా తర్వాత ఇక సినిమాలు చేయకూడదు అని అప్పటికే రిచా ఫిక్స్ అయింది. అయితే, విచిత్రంగా ఈ సినిమా హీరోతో ప్రేమాయణం సాగించి.. చివరకు అతన్నే వివాహం చేసుకుని ఇక సినిమాలకు దూరం అయింది.
ఈ లోపు రిచాకి ఒక కొడుకు పుట్టాడు. కుటుంబం కోసం ఆర్థికంగా అండగా నిలబడటానికి రూట్ మార్చి డబ్బింగులు చెప్పడం మొదలు పెట్టింది. ఇప్పుడు హిందీలో వస్తోన్న ప్రతి ఐదు సినిమాల్లో కనీసం ఒక్క సినిమా అయినా రిచా డబ్బింగ్ చెప్పిన సినిమానే అయి ఉంటుంది. అంత గొప్పగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. మొత్తానికి ఒక నటిగా తన ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ కాలేకపోయినా పర్సనల్ లైఫ్ లో మాత్రం రిచా బాగా సక్సెస్ అయింది.
https://youtu.be/1A8YiZ78z58