Sai Madhav Burra: మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి జరిగేది ఇదే… గేమ్ ఛేంజర్ రైటర్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

Sai Madhav Burra: రామ్ చరణ్ భారీ చిత్రాల హీరోగా మారిపోయారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన రేంజ్ ఊహించని స్థాయికి వెళ్ళింది. భవిష్యత్ లో రామ్ చరణ్ హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే సూచనలు కలవు. దీనికి సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న గేమ్ ఛేంజర్ 2024 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం కలదు. ఇక ఈ చిత్రం నుండి వస్తున్న ఒక్కో […]

Written By: Shiva, Updated On : April 20, 2023 5:06 pm
Follow us on

Sai Madhav Burra

Sai Madhav Burra: రామ్ చరణ్ భారీ చిత్రాల హీరోగా మారిపోయారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన రేంజ్ ఊహించని స్థాయికి వెళ్ళింది. భవిష్యత్ లో రామ్ చరణ్ హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే సూచనలు కలవు. దీనికి సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న గేమ్ ఛేంజర్ 2024 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం కలదు. ఇక ఈ చిత్రం నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ హైప్ పెంచేస్తుంది. గేమ్ ఛేంజర్ చిత్రానికి మాటల రచయితగా పని చేస్తున్న సాయి మాధవ్ బుర్రా కీలక కామెంట్స్ చేశారు.

సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ… జెంటిల్ మాన్ సినిమా చూసాక దర్శకుడు శంకర్ తో ఒక ఫోటో దిగితే చాలు అనుకున్నాను. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చింది. గేమ్ ఛేంజర్ అంచనాలకు మించి ఉంటుంది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, సినిమా అసలు తగ్గదు. ప్రతి ఫ్రేమ్, షాట్ గ్రాండియర్ గా ఉంటుంది. అది కథలో భాగంగా ఉంటుంది. ఏదో కావాలని తెచ్చి పెట్టినట్టు ఉండదు. గేమ్ ఛేంజర్ పెద్ద కథ. దర్శకుడు శంకర్ గొప్పగా తీర్చిదిద్దుతున్నారు… అని అన్నారు.

సాయి మాధవ్ బుర్రా కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ ఫిక్స్ అయ్యారు. పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. శంకర్ గతంలో దర్శకత్వం వహించిన ఒకే ఒక్కడు ట్రెండ్ సెట్టర్. ఆ మూవీలో ఆయన ఒక్కరు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఊహించని అనుభూతిపంచారు. గేమ్ ఛేంజర్ మూవీలో ఎన్నికల గురించి ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం.

Sai Madhav Burra

గేమ్ ఛేంజర్ కాన్సెప్ట్ అండ్ టైటిల్ వీడియో దీనిపై హింట్ ఇచ్చింది. ఇక గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఆయన పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నారు. మరో పాత్రలో ఎన్నికల అధికారిక అట. దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.