https://oktelugu.com/

Bigg Boss Geetu : నాగార్జున కలిసిన గీతూ ఆపై ఓ చెత్త పని… వాళ్ళ అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుందట

Bigg Boss Geetu Royal  : ప్రస్తుతం గీతూ రాయల్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా బిగ్ బాస్ ప్రేక్షకులు ఆమెను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. విమర్శలు ప్రశంసల సంగతి పక్కన పెడితే గీతూ చాలా ప్రత్యేకమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోకి ఏదో మొక్కుబడిగా ఆమె రాలేదు. చాలా ప్రణాళికగా అడుగుపెట్టింది. బిగ్ బాస్ రివ్యూవర్ గా ఆమెకు గేమ్ పట్ల ఒక అవగాహన ఉంది. అందుకే […]

Written By: , Updated On : December 1, 2022 / 09:10 PM IST
Follow us on

Bigg Boss Geetu Royal  : ప్రస్తుతం గీతూ రాయల్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా బిగ్ బాస్ ప్రేక్షకులు ఆమెను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. విమర్శలు ప్రశంసల సంగతి పక్కన పెడితే గీతూ చాలా ప్రత్యేకమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోకి ఏదో మొక్కుబడిగా ఆమె రాలేదు. చాలా ప్రణాళికగా అడుగుపెట్టింది. బిగ్ బాస్ రివ్యూవర్ గా ఆమెకు గేమ్ పట్ల ఒక అవగాహన ఉంది. అందుకే ఫస్ట్ డే నుండి తన ఆట మొదలు పెట్టింది. అసలు ఆట అంటే ఏమిటో గీతూని చూసి కంటెస్టెంట్స్ నేర్చుకున్నారు.

ఫస్ట్ డే నుండి కౌంట్ అవుతుందని నమ్మిన ఏకైన కంటెస్టెంట్ గీతూ. ఆమె హౌస్లో సన్నిహితంగా ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఆదిరెడ్డి. స్నేహం స్నేహమే ఆట ఆటే అన్నట్లు… తేడా వస్తే గీతూ ఆదిరెడ్డితో కూడా పోరుకు దిగేది. ముక్కుసూటిగా మాట్లాడుతూ గీతూ కంటెస్టెంట్స్ అందరికీ శత్రువు అయ్యారు. ఈ కారణంగా ఆమె ప్రతివారం నామినేషన్స్ లో ఉండేవారు. గీతూ గేమ్ బిగ్ బాస్ కి పిచ్చగా నచ్చేసింది. హౌస్లో ఆమెకు ఇచ్చే ప్రయారిటీ వేరుగా ఉండేది.

హోస్ట్, బిగ్ బాస్ గీతూను ఓ రేంజ్ లో పొగిడారు. పొగడ్తలు చెడగొడతాయి అనడానికి గీతూ ఎలిమినేషన్ చక్కని ఉదాహరణ. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ గా టర్న్ అయ్యింది. రెండు వారాలుగా గీతూ గేమ్ పేరుతో చేయకూడని మిస్టేక్స్ చేసింది. ఆమె పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. అనూహ్యంగా గీతూ 9వ వారం ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ షో కూడా కన్నీరు తెప్పిస్తుందని గీతూ ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రూవ్ చేసింది. నేను వెళ్లను సర్… ఎన్నో కలలు కన్నానని గీతూ ఏడుస్తుంటే ఆడియన్స్ సైతం కన్నీరు పెట్టుకున్నారు.

వేదికపై గీతూ వేదన నేరుగా చూసిన నాగార్జున ఇటీవల గీతూని తన ఇంటికి పిలిచారట. ఆమె ఇంకా డిప్రెషన్ ఫీల్ అవుతుంటే ధైర్యం చెబుదామనే ఆలోచనతో గీతూని ఆయన కలిశారట. ఈ విషయాన్ని గీతూ తాజా వీడియోలో వెల్లడించారు. ఫ్యామిలీ ఎపిసోడ్ చూసి బాగా ఏడ్చాను. నేను ఉంటే అమ్మను హౌస్లో చూడాలి అనుకున్నాను. దాని కోసం మంచి చీర కూడా కొన్నానని గీతూ చెప్పింది. అలాగే గీతూ తన కాలిపై చిరుత మచ్చలు టాటూగా వేయించుకున్నారు. ఒక గాయాన్ని కవర్ చేసుకోవడానికి ఆమె టాటూ వేయించుకున్నారట. ఈ విషయం అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుందని గీతూ చెప్పడం విశేషం.

First Thuppas Thing After 20 Days Depression🥺 మా అమ్మకి తెలిస్తే 👡తో కొడుతుంది!