Bairi Naresh vs Lalit: హిందూ దేవతలను కించపరిచేలా భైరి నరేశ్‌పై రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాడులకు కూడా తెగబడ్డాయి. దీంతో నరేశ్ తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇప్పుడిప్పుడే మానుతున్న గాయాన్ని మళ్లీ రేపే ప్రయత్నం చేసింది యూట్యూబ్ చానెల్ సిగ్నిచర్ స్టూడియో. వివాదం కొనసాగుతున్న సమయంలో హిందూ సంఘం ప్రతినిధి లలిత్‌కుమార్ భైరి నరేశ్‌తో తాను మాట్లాడతానని, దేవుడు ఉన్నానని నమ్మిస్తానని ప్రకటించాడు. దీనిని ఆధారంగా చేకుని సిగ్నిచర్ స్టూడియో నిర్వాహకుడు డిబేట్ ఏర్పాటు చేసి మళ్లీ గొడవకు ఆజ్యం పోశాడు.
చెప్పులు చూపుకుంటూ..
ఈ డిబేట్‌లో మొదట లలిత్‌కుమార్‌ను పిలిచిన యాంకర్.. తర్వాత ఆయనకు నాటి హామీ గుర్తుచేసి భైరి నరేశ్‌ను రప్పించారు. ఈ సందర్భంగా హిందూ దేవుళ్ల గురించిన ప్రశ్నలనే ఇద్దరూ అడిగారు. ఒకరు ఔనంటే.. ఇంకొకరు కాదంటూ.. డిబేట్‌లో ర చ్చకు దారితీశాడు. ఒక దశలో హిందూ దేవతలను కించపరిచేవాడిని చెప్పుతో కొడతా అని లలిత్‌కుమార్ అనగా, చెప్పులు కుట్టేవాడిని అంటరానివాడిగా ప్రకటించే మత వాదులను ఏ చెప్పుతో కొట్టాలని భైరి నరేశ్ కౌంటర్ ఇచ్చాడు.
రెచ్చగొట్టేలా ప్రశ్నలు..
ఇక యాంకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి డిబేట్‌లో గొడవ జరిగే అవకాశం ఉంటే దానిని అవైడ్ చేయాలి. కానీ ఇక్కడ మరింత రెచ్చగొట్టే ప్రశ్నలతో గొడవను పెంచాడు. అయ్యప్ప పుట్టుక, మకర జ్యోతి గురించి ప్రశ్నలు వేశాడు. దేవుడు ఉన్నాడా లేడా అని అడిగాడు. నాస్తికుడు అన్నప్పుడు కులం ప్రస్తావన తేవడంపై లలిత్ మండిపడ్డాడు. ఇతర మతాల దేవుళ్ల గురించి ఎందుకు మాట్లాడని భైరి నరేశ్‌ను ప్రశ్నించారు. అంటే అందరినీ తిట్టమన్నట్లుగా ప్రశ్నించడం జర్నలిజమా. ఇక కుల మతాల గురించి హిందువుల్లోనే కులాలు ఉన్నాయని, వేరే మతాల్లో కులాల ప్రస్తావన లేదని భైరి నరేశ్ చెప్పాడు. మిగతా రిలీజియన్స్‌లో క్లాస్ డిఫరెన్స్ ఉందని, క్యాస్ట్ డిఫరెన్స్ లేదని చెప్పాడు.
దేవుడన్ని చూపిస్తా అన్నా..
ఇక చివరక దేవుడిని చూపిస్తా అని లలిత్ చెప్పాడు. ప్రతీ విషయంలో దేవుడు ఉన్నాడని స్పష్టం చేశాడు. కానీ నరేశ్ దీనికి అంగీకరించలేదు. దేవుడు అవసరం లేదని, తాను చూడనని వెల్లడించాడు. అయితే బాత్‌రూంలో ఉన్నాడా అని నరేశ్ అన్నట్లు యాంకర్ ప్రశ్నించడం మరింత రెచ్చగొట్టేలా ఉంది. దీంతో డిబేట్ నుంచి లలిత్‌కుమార్ తప్పుకున్నాడు.
చివరి ప్రశ్న..
ఒక పీహెచ్‌డీ చేసి, ఉన్నత విద్యావంతుడు అయిన నరేశ్ ఇలా మతాలను కించపర్చడం, దేవులను ధూషించడం ఎందుకని యాంకర్ ప్రశ్నించాడు. అయితే దానికి నరేశ్ తను పంచే జ్ఞానం కోసం ఏ మీడియా పిలవడం లేదని, తాను చేసి వ్యాఖ్యల కోసంమే డిబేట్లు పెడుతున్నారని ఇంటర్వ్యూలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. జ్ఞానం పంచేందుకు పిలిస్తే ఎక్కడికైనా వస్తానని చాలెంజ్ చేశాడు. ఇందుకు సిగ్నిచర్ స్టూడియో యాంకర్ మేం రెడీ అన్నాడు. ఇది బాగుంది. కానీ గడిచిపోయిన గొడవను మళ్లీ డిబేట్ పెట్టి రెచ్చకొట్టడమే చెత్తగా ఉంది.