Women Fight Trash: ఒక్కోసారి కొన్ని గమ్మత్తైన విషయాలు జరుగుతుంటాయి. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుని చూస్తుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. ఇతరులు కూడా ఏం చేయలేకపోతారు. చోద్యం చూడటమే తప్ప జోక్యం చేసుకోలేరు. వారి కోపాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. బూతులకు దిగుతూ రెచ్చిపోతుంటారు. ఇలాంటి విషయాలు ఎక్కువగా నీళ్ల కాడ చోటుచేసుకోవడం తెలిసిందే. అప్పుడప్పుడు భూ తగాదాలు, ఇతర తగాదాల్లో కూడా జరుగుతుండటం మామూలే. చూడటానికి గమ్మత్తుగా అనిపించినా వారి ఆవేశంతో ఇష్టారాజ్యంగా మాటలు అంటుంటే ఎదుటి వారు నవ్వుకుంటారు.

ఓ మహిళ ఉదయాన్నే తన ఇంటి ముందు చక్కగా ఊడ్చి కళ్లాపి చల్లేందుకు వచ్చింది. చెత్తను ఊడ్చింది. తన ఇంటి ముందు ఉండే ఇంకో ఇంటి ముందు ఆ చెత్తను వేసింది. దీంతో ఆ ఇంటి మహిళ ఎందుకు వేశావని ప్రశ్నించింది. దానికి చెత్త వేసిన మహిళ వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. లొల్లి తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు పరస్పరం బూతులు వల్లెవేసుకున్నారు. చుట్టుపక్కల వారు వినోదం చూస్తున్నారు. ఇద్దరి మాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: KCR On Cloud Bursting: కేసీఆర్ ఆరోపించినట్టు క్లౌడ్ బరెస్టింగ్ సాధ్యమేనా?
ఇంతలో ఓ మహిళ తన ఇంటి ముందు ఉన్న మురుగు కాలువలోని చెత్తను ఎదురింటిలోకి విసిరింది. దీంతో ఆమె ఊరుకుంటుందా? ఆమె కూడా మరో చేత్తో చెత్తను ఇంకో మహిళ ఇంట్లోకి వెళ్లేలా చేసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. శాపనార్థాలు పెట్టుకున్నారు. అయినా వారి కోపం చల్లారలేదు. దీంతో ఇదంతా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిన్న పాటి విషయానికి ఎందుకంత రాద్ధాంతం అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

అందుకే అంటారు ముప్పై ఆరు జుట్టు కూడుంటాయి కానీ మూడు సిగలు కూడుండవని. వీరి విషయంలో ఇది నిజమే అనిపిస్తుంది. మనిషికి నోరు ఇచ్చింది బూతులు తిట్టడానికి కాదు. మంచి మాటలు మాట్లాడటానికి. ఇలాంటి గొడవలు చూస్తే మనకంటే జంతువులే నయం. ఎందుకంటే వారికి నోరు లేకపోవడంతోనే అవి ఇలాంటి గొడవలకు దిగకుండా వారి ఆగ్రహాన్ని కేవలం చేతులు, కాళ్లతోనే చూపిస్తాయి. కానీ మనుషులే తమ బలాబలాలను నోటితో తీర్చుకోవడం తెలిసిందే.
Also Read:Virat Kohli: 1000 సమీపిస్తోంది 100 ఏది? విరాట్ కోహ్లీ చివరి శతకానికి 967 రోజులు
View this post on Instagram