Love on Instagram : కరోనా సమయంలో పంబ్‌జీ ఆడుతూ ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ పాకిస్థానీ మహిళ భారత యువకుడి ప్రేమలో పడింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న ఆ మహిళ.. లాక్‌డౌన్ సమయంలో దుబయ్, నేపాల్ మీదుగా భారత్ చేరుకుంది. ఆమెను గుర్తించిన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్థాన్ పంపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. ఇదిలా కొనసాగుతుండగానే తాజాగా మరో విదేశీ మహిళ ప్రేమించిన వ్యక్తి కోసం భారత్‌కు వచ్చేసింది. జార్ఖండ్‌లో ప్రియుడి వద్ద వాలిపోయింది. పోలండ్ నుంచి వచ్చిన ఈ మహిళ పేరు పోలాక్ బర్బరా(45).
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..
జార్ఖండ్‌లోని హజారీబాద్ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్ షాదాబ్(35)కు పోలండ్‌కు చెందిన పోలాక్ బర్బరాతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. క్రమంగా అది ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే పోలాక్‌కు ఇప్పటికే వివాహమై.. ఆరేళ్ల కుమార్తె ఉంది. ఇటీవలే ఈమె తన భర్తతో విడాకులు తీసుకుంది. కొద్దిరోజుల క్రితం హజారీబాగ్ చేరుకొని షాదాబ్‌ను కలిసింది. ప్రస్తుతం అతడితో కలిసే ఉంటోంది. పోలాక్.. జార్ఖండ్ వేడికి తట్టుకోలేకపోవడంతో షాదాబ్ వెంటనే ఏసీని ఏర్పాటు చేశాడు.
భారతీయులు ప్రేమగలవారు..
ఇదిలా ఉండగా పోలాక్ మాట్లాడుతూ ‘భారత్ చాలా అందమైన దేశం. ఇక్కడి ప్రజలు ప్రేమ గలవారు. నన్ను చూసేందుకు రోజూ వందలాది మంది వస్తున్నారు’ అని చెబుతోంది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హజారీబాగ్ డీఎస్పీ రాజీవ్‌కుమార్ ఖుత్రా గ్రామానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. పోలాక్ మరికొద్ది రోజుల్లో పోలండ్ వెళ్లిపోతానని చెప్పిందని, షాదాబ్‌కు వీసా వచ్చాక అతడిని పోలండ్ తీసుకువెళ్తానని తెలిపిందని డీఎస్పీ తెలిపారు.
భారతీయులకు ఎందుకు పడుతున్నారు..
గతంలో బంగ్లాదేశ్ యువతి జగిత్యాల జిల్లా యువకుడి కోసం భారత్ చేరుకుంది. మొన్న పాకిస్థానీ యువతి, తాజాగా పోలండ్ మహిళ. ఇలా విదేశీయులంతా భారతీయుల ప్రేమలో పడుతున్నారు. అయితే పాకిస్థాన్, బంగ్లాదేశ్ యువతుల విషయం ఆలోచించాల్సి అంశం. ఎందుకంటే అవి ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉన్నాయి. పాకిస్థాన్ అయితే మన రహస్యాలను తెలుసుకోవడానికి, భారత్‌లో చొరబాటుకు, విధ్వంసానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. ఈనేపథ్యంలో ప్రతీ పాకిస్థానీని అనుమానాస్పదంగా చూడాల్సిందే. విదేశాల్లో స్థిరపడిన భారతీయులను విదేశీయులు ప్రేమించడం చూశాం. పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. కానీ కేవలం ఆన్‌లైన్ ప్రేమ పేరుతో తమ మాతృభూమిని విడిచి రావడమే అనుమానాలకు తావిస్తోంది. నిజమైన ప్రేమే అయితే అభినందించాల్సిందే. కానీ అప్పటి వరకు అనుమానించాల్సిందే.