Satyanarayana Vratam: కొత్త కోడలు రాగానే సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయిస్తారు?

Satyanarayana Vratam: సత్యనారాయణ స్వామి వ్రతం.. ఎంతో పవర్ ఫుల్ పూజ ఇదీ.. ఏ ఇంట్లో అయినా కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటే ఈ పూజ చేయాలంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఈ పూజ చేసుకుంటారు. ఈ వ్రతానికి ఎంతో శక్తి ఉంది. ఈ వ్రతం చేస్తే కష్టాలు తీరుతాయని అంటారు. సహజంగా కార్తీకమాసంలో ఎక్కువగా ఈ పూజ చేస్తారు.కొత్తగా పెళ్లి అయి అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు చేత ఈ వ్రతం చేయించడం ఆనవాయితీగా.. […]

Written By: NARESH, Updated On : August 23, 2022 4:07 pm
Follow us on

Satyanarayana Vratam: సత్యనారాయణ స్వామి వ్రతం.. ఎంతో పవర్ ఫుల్ పూజ ఇదీ.. ఏ ఇంట్లో అయినా కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటే ఈ పూజ చేయాలంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఈ పూజ చేసుకుంటారు. ఈ వ్రతానికి ఎంతో శక్తి ఉంది.

ఈ వ్రతం చేస్తే కష్టాలు తీరుతాయని అంటారు. సహజంగా కార్తీకమాసంలో ఎక్కువగా ఈ పూజ చేస్తారు.కొత్తగా పెళ్లి అయి అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు చేత ఈ వ్రతం చేయించడం ఆనవాయితీగా.. అనాధిగా వస్తోంది. అలా చేస్తే శుభకరం అంటారు.

సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణ స్వామి భూమిపై వెలిశాడని భక్తులు నమ్ముతారు.

ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన దంపతుల చేత చేయిస్తారు. వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణ స్వామిని వేడుకుంటూ ఈ వ్రతం చేస్తారు. ఆసమయంలో గ్రామంలోని అందరినీ వ్రతానికి పిలుస్తారు. ఎందుకంటే ఆ గ్రామస్థులందరూ కొత్త కోడలికి పరిచయమై.. బంధువులతోనూ కలివిడి అయ్యి కొత్త కోడలకు బెరుకుపోయి కలిసిపోతుందని ఇలా చేస్తారు.