Bigg Boss Shrihan : బిగ్ బాస్ తెలుగు 6 రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. ఫైనల్ లో అతడు టైటిల్ కోసం సింగర్ రేవంత్ తో పోటీపడ్డాడు. అయితే తన రాంగ్ డెసిషన్ తో విన్నర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. చివరి వరకు టైటిల్ నేను గెలుస్తానని విశ్వాసం ప్రకటించిన శ్రీహాన్ నాగార్జున ఆఫర్ కి టెంప్ట్ అయ్యాడు. ఏకంగా రూ. 40 లక్షలు అనగానే నిర్ణయం మార్చుకున్నాడు. విజేత ఎవరు అవుతారో తెలియదు కాబట్టి, రిక్స్ తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడాడు. మెజారిటీ ఆడియన్స్ శ్రీహాన్ కి ఓట్లు వేసి తాను విజేత కావాలని కాంక్షించారు. ఆ విషయం తెలియక అతడు టైటిల్ తో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకునే సువర్ణావకాశం చేజార్చుకున్నాడు.

కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు రూ. 40 లక్షల రూపాయల ఆఫర్ తీసుకునేలా చేశాయని శ్రీహాన్ తన నిర్ణయానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఏది ఏమైనా విన్నర్ గా రేవంత్-రన్నర్ గా శ్రీహాన్ చెరో సగం డబ్బులు సొంతం చేసుకున్నారు. శ్రీహాన్ గురించి జనాలకు తెలిసింది తక్కువ. సిరి లవర్ గా మాత్రమే అతను తెలుసు. యూట్యూబ్ ని ఫాలో అయ్యేవాళ్ళను మినహాయిస్తే సాధారణ జనాలకు శ్రీహాన్ ఎవరో ఐడియా లేదు. శ్రీహాన్ గురించి తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సేకరించడం జరిగింది. శ్రీహాన్ ముస్లిం కుటుంబంలో పుట్టాడు. తన పేరు మాత్రం హిందూ పేర్లను పోలి ఉంటుంది. పరిశ్రమలో రాణించేందుకు స్క్రీన్ నేమ్ శ్రీహాన్ గా మార్చుకొని ఉండొచ్చు. శ్రీహాన్ స్వస్థలం వైజాగ్, అక్కడే పుట్టి పెరిగాడు. పరిశ్రమకు రాకముందు శ్రీహాన్ మూడేళ్లు నేవీలో పని చేసినట్లు తెలుస్తుంది. శ్రీహాన్ కి ఇద్దరు సోదరులు ఉన్నారు. నటనపై మక్కువతో యూట్యూబర్ గా మారాడు.
సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్ళు షార్ట్ ఫిల్మ్ తో శ్రీహాన్ ఫేమస్ అయ్యాడు. ఇక సిరితో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్లలో నటించాడు. కలిసి పనిచేస్తున్న క్రమంలో వీరి మనసులు కలిశాయి. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి పాల్గొంది. అప్పుడు ఆమె కోసం శ్రీహాన్ బిగ్ బాస్ వేదికపైకి వచ్చాడు. లేటెస్ట్ సీజన్లో శ్రీహాన్ కి అవకాశం దక్కింది. ఫ్యామిలీ వీక్లో శ్రీహాన్ ని కలిసేందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన సిరి, అతని గేమ్ మెరుగయ్యేలా సలహాలు, సూచనలు ఇచ్చింది. ఫ్యామిలీ వీక్ తర్వాత శ్రీహాన్ గేమ్ మార్చి ఫైనల్ కి వెళ్లేందుకు మార్గం వేసుకున్నాడు. ఇక సిరి-శ్రీహాన్ లకు నిశ్చితార్థం కూడా జరిగిందని సమాచారం.