
Dev Mohan: సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త హీరోల హవా మొదలైంది. అయితే ఎక్కువగా మలయాళం నుంచి కుర్రహీరోలు టాలీవుడ్ కు దిగుమతి అవుతున్నారు. గతంలో మలయాళం కు చెందిన హీరోలు, నటులు ప్రత్యేక పాత్రల్లో మాత్రమే నటించేవారు. కానీ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో దేవ్ మోహన్ పలువురిని ఆకర్షిస్తున్నాడు. దేవ్ మోహన్ తెలుగు తెరకు కొత్తే కావొచ్చు. కానీ మలయాళంలో ఆయన సుప్రసిద్ధ నటుడే అని చెప్పొచ్చు.ఇటు తెలుగులో రష్మికతో అటు మలయాళంలో రష్మిక స్టార్ హీరోయిన్లతో సందడి చేస్తున్న దేవ్ గురించి ఆసక్తి విషయాలు మీకోసం.
సమంత ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ ‘శాకుంతలం’ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న ‘శాకుంతలం’లో సమంతకు జోడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. దుష్యంతుడి పాత్రలో నటించమని అడగ్గానే దేవ్ ముందు షాక్ అయ్యారట. కానీ ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలిశాక వెంటనే ఒప్పేసుకున్నారట.
కేరళకు చెందిన దేవ్ మోహన్ త్రిస్సూర్ లో జన్మించారు. 1992 సెప్టెంబర్ 18 ఆయన బర్త్ డే. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయనకు వ్యాయామం చేసే అలవాటు ఎక్కువగా ఉంది. దీంతో ఆయన రోజూ జిమ్ కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఓ మోడల్ కలిసి సినిమాల్లో ట్రై చేయిమని సలహా ఇచ్చాడు. దీంతో మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని 2016లో ఫైనల్ కు ఎంపికయ్యాడు. అప్పటికే ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించిన ఆయన విధులు నిర్వహిస్తూనే వారాంతపు రోజుల్లో ఫ్యాషన్ షోలో పాల్గొనేవారు.

వాస్తవానికి దేవ్ కు సినిమాలంటే ఆసక్తి లేదు. కానీ ఓ మిత్రుడి ఫోర్స్ తో ఆడిషన్ కు వెళ్లాడు. కొన్ని రోజుల్లోనే ఆయనకు ఓ సినిమాలో సెలెక్ట్ అయినట్లు తెలిపారు. అయితే ఆ తరువాత సినిమా స్ట్రాట్ కాకపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఆ తరువాత ‘సూఫియం సుజాతయుం’ పూర్తయిన తరువాత ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్లాప్ అయినా దేవ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఈ సినిమాలో ఆధ్యాత్మిక గురువుగా కనిపించి ఆకట్టుకున్నాడు.
ఈ సినిమా తరువాత ‘హోమ్’, ‘పాత్రుండు’ అనేసినిమాల్లో నటంచాడు. ఆ తరువాత ఆయనకు ‘శాకుంతలం’లో నటించే అవకాశం వచ్చింది. ఓ వైపు ‘శాకుంతలం’లో సమంతతో కలిసి నటిస్తున్న ఆయన మలయాళం ‘రెయిన్ బో’లో రష్మిక మందానాతో కలిసి సినిమా చేస్తున్నాడు. అందమైన హీరోల్లో దేవ్ ఒకరు కావడంతో ఆయనకు అన్ని వైపులా అవకాశాలు వస్తున్నాయని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.