Unstoppable With Nbk- Prabhas: బాలకృష్ణ హోస్టుగా వ్వవహరిస్తున్న షో అన్ స్టాబబుల్ షో ఎంతో ఘనంగా నిర్వహించబడుతోంది. ఇందులో పాల్గొనేందుకు ఎపిసోడ్ కో సెలబ్రిటీని పిలుస్తున్నారు. మొదట చంద్రబాబు నాయుడు, తరువాత శర్వానంద్ ఇలా ప్రతిసారి ఎవరో ఒకరిని ఆహ్వానిస్తూ వారిని పలు ప్రశ్నలు సంధిస్తూ ఆలోచనలో పడేస్తున్నారు. దీంతో షోకు పాపులారిటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆహ్వానించడంతో ఆయన ఏం చెబుతారో అని అందరికి ఆసక్తి నెలకొంది. ప్రతి ఎపిసోడ్ ను ఆద్యంతం అలరిస్తోన్న బాలకృష్ణ రెబల్ స్టార్ ను పలు ప్రశ్నలు అడగడంతో ఆయన చెప్పడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రభాస్ ఈశ్వర్ నుంచి బాహుబలి వరకు ఎన్నో వేరియేషన్స్ లో తనదైన శైలిలో నటించారు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ తనలోని నటనకు కొత్త భాష్యం చెప్పారు. హిట్లు తన ఇంటిపేరుగా చేసుకుని యంగ్ రెబల్ స్టార్ గా అవతరించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్ అతిథిగా రావడంతో కార్యక్రమం అదిరిపోనుంది. సామాజిక మాధ్యమాల్లో వీరి ప్రోగ్రాం చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. రేపటి రోజున రిలీజ్ అయ్యే ప్రోమో తరువాత స్ట్రీమిం్ అయ్యే ఎపిసోడ్ లో ప్రభాస్ ఏం మాట్లాడతారనే దానిపై అందరు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రభాస్ ఎందరో స్టార్ హీరోయిన్లతో నటించారు. గతంలో ఓ స్టార్ హీరోయిన్ ను ప్రభాస్ మగరాయుడుగా కామెంట్ చేశారనే వార్తలు వచ్చిన సంగతి విధితమే. ఈ క్రమంలో బాలకృష్ణ ప్రభాస్ ను ఆ ప్రశ్న అడిగినట్లు చెబుతున్నారు. మరోవైపు అనుష్కతో పెళ్లి అనే పుకార్లు షికార్లు చేస్తున్నందున బాలకృష్ణ ఆ ప్రశ్న కూడా అడిగారు. అంతేకాదు తన బ్లాక్ బస్టర్ సినిమా నుంచి ఆ హీరోయిన్ ను తప్పించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఆ హీరోయిన్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ప్రభాస్ ఆమెను అలా పోల్చారనే విషయాలు అందరిలో ఇంట్రస్ట్ పెంచుతున్నాయి.

ఇక ఆ హీరోయిన్ ఎవరే దానిపై డిసెంబర్ 31 వరకు సస్పెన్స్ కొనసాగనుంది. ఇంతకీ ప్రభాస్ మగరాయుడిలా పోల్చిన ఆమె ఎవరు? అలా పోల్చడానికి కారణాలు ఏంటి? ఆమెను చూస్తే మూడ్ రాదు అని ఎందుకన్నారు? అనే ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలుస్తున్నాయి. 31 వరకు ఆగినా ఆ ఎపిసోడ్ చూసి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని ఆశగా ఉన్నారు. రెబల్ స్టార్ ను బాలకృష్ణ ఓ లెవల్లో ఆడుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఏది ఏమైనా ఫుల్ ఎపిసోడ్ పై రెబల్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.