Jabardasth Anchors Remuneration: జబర్దస్త్ యాంకర్స్ గా అనసూయ-రష్మీ గౌతమ్ ఏళ్ల తరబడి బుల్లితెరను ఏలారు. ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఒక స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఫేమ్ వారి సొంతం. 2013లో జబర్దస్త్ కామెడీ షో మొదలు కాగా అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు అది డెబ్యూ యాంకరింగ్ షో. గతంలో న్యూస్ ప్రెజెంటర్ గా చేశారు. కొన్ని సినిమాల్లో అవుట్ ఆఫ్ ఫోకస్ రోల్స్ చేశారు. యాంకరింగ్ లో పెద్దగా అనుభవం లేకున్నా… అనసూయ సక్సెస్ అయ్యారు. ఆమె గ్లామర్ షోకి ప్రత్యేకంగా నిలిచింది. పొట్టిబట్టల్లో స్కిన్ షో చేస్తూ యాంకరింగ్ చేసే సాంప్రదాయం అప్పటి వరకూ లేదు.

బాలీవుడ్ షోలు స్ఫూర్తిగా అనసూయ స్కిన్ షో చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు. కొన్ని ఎపిసోడ్స్ అనంతర వ్యక్తిగత కారణాలతో అనసూయ షో నుండి తప్పుకున్నారు. అప్పుడు రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చారు. నటిగా అడపాదడపా పాత్రలు చేస్తున్న ఆమె జబర్దస్త్ యాంకర్ గా మారారు. అనసూయ ఉన్నప్పటికంటే ఎక్కువ ఆదరణ రష్మీ వచ్చాక షోకి దక్కింది. దాంతో ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో స్టార్ట్ చేశారు. దాంతో అనసూయకు రీఎంట్రీ ఇచ్చారు.
క్లాస్ మాస్ అనే తేడా లేకుండా జబర్దస్త్ జనాల్లోకి వెళ్ళిపోయింది. విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. రెండు షోలు తిరుగులేని టీఆర్పీతో దూసుకెళ్లాయి. అనసూయ, రష్మీ స్టార్స్ అయిపోయారు. వారు కలలు కన్న హీరోయిన్ ఛాన్స్ లు జబర్దస్త్ కారణంగా వారికి లభించాయి. ఏళ్లుగా విశ్వ ప్రయత్నం చేసినా వారికి హీరోయిన్ అయ్యే ఛాన్స్ దక్కలేదు. జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన ఫేమ్ వాళ్ళను హీరోయిన్ చేసింది.

జబర్దస్త్ షోకి వారిద్దరూ కీలకంగా మారారు. దాదాపు పదేళ్లుగా పని చేస్తున్నారు. అనసూయ మాత్రం గత ఏడాది వెళ్ళిపోయింది. ఆమె బుల్లితెరకు బైబై చెప్పేశారు. రష్మీ ఇంకా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వీరి రెమ్యూనరేషన్ ఎంత? ఎవరికెక్కువ? అనే సందేహాలు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం రష్మీ-అనసూయలకు సమాన రెమ్యూనరేషన్ ఇస్తారు. అది ఎపిసోడ్ కి లక్ష రూపాయలు. అంటే నెలకు రూ. 4 లక్షలు. నెలలో ఐదు వారాలుంటే రూ. 5 లక్షలు వస్తాయి. ఇక కొత్తగా వచ్చిన సౌమ్యరావుకి రూ. 50 వేలు ఇస్తున్నట్లు సమాచారం. పెర్ఫార్మన్స్ ఆధారంగా పెంచుతామని హామీ ఇచ్చారట.