Samantha : సినిమాల్లోకి రాక ముందు సమంత అలాంటి పనులు చేసిందా.. పేదరికం కారణంగా!

Samantha : సమంత పరిశ్రమలో అడుగుపెట్టి 13 ఏళ్ళు అవుతుంది. 2010 ఫిబ్రవరి 26న సిల్వర్ స్క్రీన్ మీద ఆమె మాయాజాలం మొదలైంది. సమంత డెబ్యూ మూవీ ఏమాయచేసావే ఇదే రోజు విడుదలైంది. దర్శకుడు గౌతమ్ మీనన్ వాసుదేవ్ తన ఎమోషనల్ లవ్ స్టోరీకి ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ కి హాజరైన సమంత లుక్ గౌతమ్ మీనన్ కి బాగా నచ్చేసింది. స్క్రిప్ట్ లో రాసుకున్న పాత్ర తన ముందే కూర్చున్న భావన […]

Written By: NARESH, Updated On : February 26, 2023 2:31 pm
Follow us on

Samantha : సమంత పరిశ్రమలో అడుగుపెట్టి 13 ఏళ్ళు అవుతుంది. 2010 ఫిబ్రవరి 26న సిల్వర్ స్క్రీన్ మీద ఆమె మాయాజాలం మొదలైంది. సమంత డెబ్యూ మూవీ ఏమాయచేసావే ఇదే రోజు విడుదలైంది. దర్శకుడు గౌతమ్ మీనన్ వాసుదేవ్ తన ఎమోషనల్ లవ్ స్టోరీకి ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ కి హాజరైన సమంత లుక్ గౌతమ్ మీనన్ కి బాగా నచ్చేసింది. స్క్రిప్ట్ లో రాసుకున్న పాత్ర తన ముందే కూర్చున్న భావన కలిగింది. మరో ఆలోచన లేకుండా సమంతను ఎంపిక చేశారు. ఇక నాగ చైతన్య హీరో. ఆయనకు ఇది రెండో చిత్రం మాత్రమే.

కేరళ క్రిస్టియన్ అమ్మాయి తెలుగు హిందూ అబ్బాయి మధ్య లవ్ స్టోరీ. సమంత చాలా సెటిల్డ్, మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ఒక కొత్త హీరోయిన్ అనే భావన ప్రేక్షకులకు కలగలేదు. పెద్ద అందగత్తె కాకపోయినా ఆమె ముఖంలో ఏదో మ్యాజిక్ ఉంది. అది ఆడియన్స్ ని ఆకర్షించింది. ఏమాయచేశావే సూపర్ హిట్.మొదటి చిత్రంతోనే విజయం అందుకుంది. అక్కడ నుండి సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్ మీద హిట్టు కొడుతూ , సూపర్ స్టార్స్ తో జతకడుతూ ఎవరికీ అందనంత రేంజ్ కి వెళ్ళింది. కమర్షియల్, లేడీ ఓరియెంటెడ్, ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు.

ది ఫ్యామిలీ మాన్ 2తో డిజిటల్ సీరీస్ లో కూడా తనకు తిరుగులేదని నిరూపించింది. దేశంలోనే టాప్ స్టార్ గా ఎదిగిన సమంత చాలా చిన్న స్థాయి నుండి పైకి వచ్చారు. చెన్నైలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. చిన్నప్పటి నుండి చాలా చురుగ్గా ఉండేది. చదువులో ఫస్ట్. డిస్టెన్స్ మార్కులు తెచ్చుకునేది. పాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద ఆధారపడటం సమంతకు ఇష్టం ఉండేది కాదు. ఒక ప్రక్క చదువుకుంటూనే డబ్బులు సంపాదించాలనుకునేది.

అందుకు మోడలింగ్ ఎంచుకుంది. చిన్న చిన్న యాడ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ లో సమంత పాల్గొనేవారు. అలా వచ్చిన వెయ్యి రెండు వేలను పాకెట్ మనీగా వాడుకునేవారట. సమంతకు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎవరి మీదా ఆధారపడకూడదనే సిద్ధాంతం ఫాలో అవుతుంది. ఆ క్వాలిటీ ఎన్నడూ ఆమె వదల్లేదు. అదే సమయంలో నచ్చినట్లు ఉంటుంది. విమర్శలను లెక్క చేయదు. ఎంతటి సమస్య వచ్చిన మనోధైర్యంతో ఎదుర్కొంటుంది. ఆటుపోట్లకు చలించకుండా ముందుకు వెళుతుంది. ప్రాణాంతక మయోసైటిస్ ని కూడా ఎదిరించి నిలిచింది. వరుస ప్రాజెక్ట్స్ తో దుమ్మురేపుతోంది.