Both Are Gay: ఇద్దరు గేల మధ్య చోటుచేసుకున్న గొడవ ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైంది. కర్ణాటకలోని బెంగుళూరులో ప్రదీప్ అనే గే ఉంటున్నాడు. అతడు ఓ షాపులో పనిచేస్తూ రూం అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. పురుషులతో లైంగిక సంబంధాలు కొనసాగించే ప్రదీప్ కు ఆటో డ్రైవర్ రక్షిత్ గౌడతో పరిచయం ఏర్పడింది. ఆడవేషధారణలో ఉండే ప్రదీప్ పై రక్షిత్ కన్ను వేశాడు. ఎలాగైనా అతడితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని పరిచయం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగేది.

లేడీ గెటప్ లో ఉన్న ప్రదీప్ మగవారిని తన వైపుకు తిప్పుకునేవాడు. అచ్చం ఆడపిల్లలా ఉండటంతో చాలామంది కూడా అతడికి దగ్గరయ్యారు. తీరా చూస్తే తప్ప అతడి వేషం గురించి ఎవరికి తెలియదు. అలాగే రక్షిత్ కూడా మోసపోయాడు. లేడీ గెటప్ చూసి మోసపోయాడు. కానీ చివరకు తెలుసుకున్నా అతడితో లైంగిక సంబంధం కొనసాగించాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో తరచుగా అతడి దద్గరకు వచ్చి తన కామవాంఛ తీర్చుకునే వాడు
Also Read: Vikram Second Week Collections: రూ. 300 కోట్ల దిశగా విక్రమ్… రెండో వారం కూడా తగ్గని కమల్ జోరు!
ఈ క్రమంలో మద్యం సేవించిన రక్షిత్ గౌడ తన కోరిక తీర్చాలని రక్షిత్ గౌడ మే 28న ప్రదీప్ ఇంటికి వెళ్లాడు. తన కామవాంఛ తీర్చాలని ఒత్తిడి చేశాడు. దానికి ప్రదీప్ ససేమిరా అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన రక్షిత్ కత్తితో ప్రదీప్ పై దాడి చేయాలని చూడగా అదే కత్తి తీసుకుని ప్రదీప్ రక్షిత్ ను పొడిచాడు. దీంతో రక్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన్నాళ్లుగా వీరి మద్య లైంగిక సంబంధాలు కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నారు.
తరువాత గదికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంట్లో నుంచి కుళ్లు వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా రక్షిత్ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రదీప్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మొత్తానికి రక్షిత్ కు కలిగిన విపరీత వాంఛకు భారీ మూల్యమే చెల్లించాల్సి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఒక గే చేతిలో హత్యకు గురికావడంతో ఆశ్చర్యపోతున్నారు.
[…] […]