Taraka Ratna : నారా లోకేష్ ‘యువ గళం’ పాదయాత్ర లో పాల్గొని గుండెపోటు తో అక్కడిక్కకడే కుప్పకూలి, సుమారుగా 23 రోజుల పాటు మృత్యువు తో యుద్ధం చేసిన నందమూరి తారకరత్న, నిన్న తన తుది శ్వాసని విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.రాజకీయాల్లో ఉన్నప్పటికీ అన్నీ పార్టీల వారితో అజాత శత్రువు అనిపించుకున్న తారకరత్న ఇలా అతి చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు.నేడు అభిమానులు మరియు బందుమిత్రుల సందర్శన కోసం తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు.ఇది ఇలా ఉండగా తారకరత్న గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే తారకరత్న అసలు పేరు గురించి ఆయన మిత్రులు ఈరోజు మీడియా ముందు మాట్లాడడం హాట్ టాపిక్ గా నిల్చింది.తండ్రి నందమూరి మోహన్ కృష్ణ తారకరత్న కి పెట్టిన అసలు పేరు ‘ఓబులేషు’ అట.చిన్నప్పటి నుండి ఇంట్లో కానీ, స్కూల్ లో కానీ మరియు కాలేజీ లో కానీ ఆయనని అందరూ అదే పేరుతో పిలిచేవారట.స్నేహితులు అయితే ‘ఓబు’ అని పిలిచేవారట.అయితే చిన్నప్పటి నుండి సినిమా హీరో అవ్వాలనే కొరికితే ఉన్న తారకరత్న ఇండస్ట్రీ కి వచ్చే ముందే తన తాతగారి పేరు కలిసి వచ్చేలా నందమూరి తారకరత్న అని పెట్టుకున్నాడట.పేరు బాగా పాపులర్ అయ్యింది కానీ, ఆయనకీ సక్సెస్ లు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది.హీరో గా సక్సెస్ కాకపోయినా నటుడిగా తారకరత్న ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.కేవలం హీరో గా మాత్రమే కాదు, విలన్ గా కూడా ఆయన పలు సినిమాల్లో నటించాడు.
ముఖ్యంగా ‘అమరావతి’ సినిమాలో ఆయన చేసిన నెగటివ్ క్యారక్టర్ కి నంది అవార్డు కూడా వచ్చింది.రీసెంట్ గానే ఆయన డిస్నీ + హాట్ స్టార్ లో ‘9 హావర్స్’ అనే వెబ్ సిరీస్ కూడా చేసాడు.ఆ సిరీస్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.అలా సినిమాల పరంగా రాజకీయ పరంగా దూసుకుపోతున్న తారకరత్న కి ఇలా జరగడం అనేది దురదృష్టకరం.ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.