నేడు ఎన్టీఆర్(Junior NTR) పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం ‘వార్ 2′(War2 Movie) మూవీ నుండి మేకర్స్ టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్(Hrithik Roshan) స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఇద్దరి మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ట్రైన్ మీద, ఫ్లైట్ మీద ఫైట్ సన్నివేశాలను చూసి ఇరువురి హీరోల అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఎన్టీఆర్ లుక్స్ విషయం లో సోషల్ మీడియా లో అనేక ట్రోల్స్ వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడు అని అనేవాళ్ళు ఉన్నారు, అదే విధంగా ఎన్టీఆర్ ముందు హృతిక్ రోషన్ తేలిపోయాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఇలాంటి కామెంట్స్ తప్పవు మరి.
Also Read: ప్రభాస్ కి లెగ్ ఇంజురీ అయిందా..? 5 cr పెట్టి టూర్ వెళ్లడం వెనక అసలు కారణం ఇదేనా..?
ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ ని బట్టి చూస్తుంటే ఇందులో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఎన్టీఆర్ మామూలు నెగటివ్ రోల్ ని ఎందుకు ఒప్పుకుంటాడు చెప్పండి. టీజర్ ని బట్టి కథ ని అంచనా వేస్తే కబీర్ టీం లో ఎన్టీఆర్ ఒకప్పుడు పని చేసేవాడు. అతని పనితీరు అన్నా, అతనికి ఉన్న దేశభక్తి అన్నా ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. అలా తానూ ఇష్టపడే కబీర్ టీం లో ఎన్టీఆర్ వెన్నుపోటు కి గురి అవుతాడు. అదంతా కబీర్ చేయించి ఉంటాడని ఎన్టీఆర్ అనుకుంటాడు. అప్పటి నుండి అతని పై పగ పెంచుకొని కబీర్ టీం కి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. ఈ క్రమం లో ఎన్టీఆర్,హృతిక్ రోషన్ మధ్య ఎన్నో ఫైట్స్ కూడా జరుగుతాయి. చివరికి టీం లో దాగున్న అసలు దొంగ ఎవరో కనుక్కొని వీళ్లిద్దరు కలిసి మెయిన్ విలన్ తో ఫైట్ చేస్తారు.
టూకీగా చెప్పాలంటే ఇదే స్టోరీ అయ్యి ఉండొచ్చు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి స్పై సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ అయిపోతుంది అనుకోవచ్చు. అయితే టీజర్ మొత్తం చూసిన తర్వాత అనిపించిన మరో ఫీలింగ్ ఏమిటంటే, VFX షాట్స్ ఎందుకో బాగా కుదిరినట్టు లేదు, ఇంకా బాగా వర్క్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండడం తో కచ్చితంగా సోషల్ మీడియా లో వచ్చే ఫీడ్ బ్యాక్ ని మూవీ టీం తీసుకుంటుంది అనే అనుకుంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది.