https://oktelugu.com/

Waltair Veerayya 100 Days : ఎన్నాకెన్నాళ్లకు.. తెలుగు నాట 100 రోజుల సినీ పండుగ.. అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి కే సాధ్యం

Waltair Veerayya 100 Days : 100 డేస్ ఫంక్షన్.. ఈ మాట విని టాలీవుడ్ చాలా రోజులైంది. అప్పట్లో చిరంజీవి ముఠామేస్త్రీ నుంచి కొదమ సింహం వరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు 100 రోజులు ఒక్క థియేటర్ లోనే ఆడేవి. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా వారం.. లేదంటే రెండు వారాలు.. మహా అయితే నెలరోజులు ఆడుతుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుంది. కొద్దిరోజులకు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 13, 2023 / 04:58 PM IST
    Follow us on

    Waltair Veerayya 100 Days : 100 డేస్ ఫంక్షన్.. ఈ మాట విని టాలీవుడ్ చాలా రోజులైంది. అప్పట్లో చిరంజీవి ముఠామేస్త్రీ నుంచి కొదమ సింహం వరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు 100 రోజులు ఒక్క థియేటర్ లోనే ఆడేవి. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా వారం.. లేదంటే రెండు వారాలు.. మహా అయితే నెలరోజులు ఆడుతుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుంది. కొద్దిరోజులకు టీవీలో వచ్చేస్తుంది.. జనాలుసినిమా చూసేస్తున్నారు.

    కానీ ఓ 20 ఏళ్ల కిందట ఇలా ఉండేది కాదు. ఈ టీవీలు, ఓటీటీలు పెద్దగా లేని రోజులు అవి. నాడు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలయ్యల హిట్ సినిమాలు 100 రోజులు ముందుగా నగరాల్లో ఆడేవి. ఆ తర్వాత పట్టణాలు, గ్రామాల్లోని బీ, సీ సెంటర్లలో ఈ ప్రింట్లు తీసుకెళ్లి అక్కడ ప్రజలకు ప్రదర్శించేవారు. టాప్ హీరోల సినిమాలు గ్రామాలకు వచ్చేసరికి ఎంత లేదన్నా 50 రోజుల నుంచి 100 రోజులు పట్టేవి. అలా ఒక్క థియేటర్ లోనే 100 రోజులు జనాలు చూసేవారు. ఆదరించేవారు.

    కానీ ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల యుగంలో 100 రోజుల సినిమాలు ఆడడం లేదు. బాహుబలి , ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఈ మార్క్ చేరుకోవడం లేదు. నెలరోజులు ఆడితే అదే గొప్ప. అవతార్ 2 కూడా అన్ని రోజులు ఆడలేదంటే అతిశయోక్తి కాదేమో.

    కానీ మన చిరంజీవి సినిమాలు 90వ దశకంలో 100 రోజులు, 200 రోజులు ఆడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. 100 రోజుల పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించేవారు. ఇప్పుడు కనుమరుగైన ఆ సంస్కృతిని మళ్లీ మన చిరంజీవినే మొదలుపెట్టాడు.

    చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా విడుదలై దిగ్విజయంగా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో ఆడుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 22న వాల్తేరు వీరయ్య 100 రోజుల ఫంక్షన్ ను ఘనంగా చీపురుపల్లిలో నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు గా ఈ పండుగలు ఏ సినిమాకు చేయడం లేదు. అయితే ప్రీరిలీజ్, సక్సెస్ మీట్ తప్పితే 100 రోజుల పండుగ అన్నది చూడలేదు. కానీ ఈ ఘనత కూడా మన ఒక్క మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమవుతోంది. మళ్లీ 100 రోజుల పండుగతో ఆయన ఇండస్ట్రీకి ఒక కొత్త ఊపు తెచ్చారని చెప్పొచ్చు.