https://oktelugu.com/

TV9 Vishwak sen Viral Video : టీవీ9 స్టూడియోలో విశ్వక్ సేన్ హల్ చల్.. బయటకు గెంటేసిన యాంకర్

vishwaksen hulchul at tv9 studio : టీవీ9 అంటే అదొక బ్రాండ్.. ఎవరైనా చర్చకు వస్తే వారి తాట తీస్తారు. వారిని మాట్లాడకుండా ఇరుకునపెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు.  కొండకు, కొండనాలుకకు ముడిపెడుతూ నేతలు, ఇతర ప్రముఖులపై యాంకర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కానీ కరెక్ట్ పర్సన్ దొరకనంత వరకే ఈ టీవీ9 యాంకర్ల మాట చెల్లుతుంది. కొంచెం తిక్కున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం టీవీ9కు జడుసుకోలేదు. ఏకంగా కౌంటర్ అటాక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 2, 2022 / 01:37 PM IST
    Follow us on

    vishwaksen hulchul at tv9 studio : టీవీ9 అంటే అదొక బ్రాండ్.. ఎవరైనా చర్చకు వస్తే వారి తాట తీస్తారు. వారిని మాట్లాడకుండా ఇరుకునపెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు.  కొండకు, కొండనాలుకకు ముడిపెడుతూ నేతలు, ఇతర ప్రముఖులపై యాంకర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కానీ కరెక్ట్ పర్సన్ దొరకనంత వరకే ఈ టీవీ9 యాంకర్ల మాట చెల్లుతుంది. కొంచెం తిక్కున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం టీవీ9కు జడుసుకోలేదు. ఏకంగా కౌంటర్ అటాక్ ఇచ్చాడు. నోటిదురుసుగా మాట్లాడిన యాంకర్ తాటతీశాడు. లైవ్ లో కౌంటర్లతో విరుచుకుపడి హాట్ టాపిక్ గా మారారు. టీవీ9 స్టూడియోకు వెళ్లి మరీ దడదడలాడించిన హీరో విశ్వక్ తీరుతో ఆయనను స్టూడియో నుంచి గెంటేసిన పరిస్థితి నెలకొంది.

    తన సినిమా ప్రమోషన్ ను వింతగా చేసిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చిక్కుల్లో పడ్డారు. రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ ‘ఫ్రాంక్’ వీడియో చేశానని అన్న విశ్వక్ పై ఓ న్యాయవాది అరుణ్ కుమార్ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయడం ఏంటని ఫిర్యాదు చేయడంతో హెచ్.ఆర్.సీ ఈ పిటీషన్ ను స్వీకరించింది. విశ్వేక్ సేన్ పై కేసులు పెట్టేందుకు రెడీ అయ్యింది.

    Also Read: Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న రాం రాం..! షాకింగ్ కారణం ఇదేనా..?

    -అసలు ఈ వివాదానికి కారణమేంటంటే?
    విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే చిత్రం మే 6న థియేటర్లలో విడుదల అవుతోంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వేక్ సేన్ ఓ ఫ్రాంక్ వీడియోను ట్రై చేశాడు. వెరైటీగా ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని రోడ్డుపై సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసే ఎపిసోడ్ ను రూపొందించాడు. విశ్వక్ సేన్ ఫిలింనగర్ వైపు వెళుతుండగా ఆయన కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని రచ్చ రచ్చ చేశాడు. ‘అశోకవనంలో’ సినిమాలో విశ్వక్ పోషించిన పాత్ర ‘అల్లం అర్జున్ కుమార్’కు 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదని.. దాన్ని తట్టుకోలేకనే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ సినీ క్రియేట్ చేశారు.

    విశ్వక్ సేన్ తనకేం తెలియదు అన్నట్లు ఈ డ్రామాను బాగా రక్తికట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ సూసైడ్ కాన్సెప్ట్ తో విశ్వక్ సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ వచ్చింది. అయితే సూసైడ్ పేరుతో నడిరోడ్డుపై ‘ఫ్రాంక్ వీడియో’ చేయడం.. న్యూసెన్స్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇక న్యాయవాది అరుణ్ కుమార్ దీనిపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయగా దాన్ని స్వీకరించారు.

    ఫ్రాంక్ వీడియో చేస్తే కేసులు పెడుతారా? అని విశ్వక్ సేన్ నిలదీశారు. దీంతో దీనిపై వివరణ ఇచ్చేందుకు విశ్వక్ సేన్ సోమవారం టీవీ9 స్టూడియో డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ ను ఉద్దేశించి యాంకర్ దేవీ ‘డిప్రెష్డ్ పర్సన్’; ‘పాగల్ సేన్’ అంటూ నోరుపారేసుకుంది. దీనిపై విశ్వక్ సేన్ అభ్యంతరం వ్యక్తం చేశాను. దీనిపై తాను పరువు నష్టం వేసే హక్కు తనకు ఉందని.. కానీ నీలాగా దిగజారి తాను అలా చేయనని యాంకర్ ముఖం మీదే చెప్పేశాడు. ఇద్దరి మధ్య వివాదం పెద్దది అయ్యింది. సహనం కోల్పోయిన టీవీ9 యాంకర్ దేవీ ‘గెట్ ఔట్’.. స్టూడియో నుంచి బయటకు వెళ్లు అంటూ గెంటేసింది. ఇలా డిబేట్ కు పిలిచి అవమానిస్తారా? అంటూ విశ్వేక్ బూతు పదాల వాడుతూ బయటకు వచ్చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Also Read: Highest Sold Movie Tickets On First Day: మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమా ఏమిటో తెలుసా..?

    పిలిచి మరీ విశ్వక్ సేన్ ను టీవీ9 యాంకర్ అవమానించడం తప్పు అయితే.. సహనం కోల్పోయిన రెచ్చిపోయిన హీరో విశ్వక్ సేన్ కూడా తగ్గకుండా వాదులాడాడు. ఇలా వీరిద్దరి లొల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

    Recommended Videos