Das ka Dhamki Review : ‘దాస్ కా ధమ్కీ’ మూవీ ఫుల్ రివ్యూ

Das ka Dhamki Review : నటీనటులు : విశ్వక్ సేన్, నివేత పేతు రాజ్, రావు రమేష్,హైపర్ ఆది, అజయ్ , అక్షర గౌడా, రోహిణి డైరెక్టర్ : విశ్వక్ సేన్ సంగీతం : లియోన్ జేమ్స్ బ్యానర్ : విశ్వక్ సేన్ క్రియేషన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్.కేవలం హీరో గా […]

Written By: NARESH, Updated On : March 22, 2023 10:07 am
Follow us on

Das ka Dhamki Review : నటీనటులు : విశ్వక్ సేన్, నివేత పేతు రాజ్, రావు రమేష్,హైపర్ ఆది, అజయ్ , అక్షర గౌడా, రోహిణి

డైరెక్టర్ : విశ్వక్ సేన్
సంగీతం : లియోన్ జేమ్స్
బ్యానర్ : విశ్వక్ సేన్ క్రియేషన్స్

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్.కేవలం హీరో గా మాత్రమే కాదు, డైరెక్టర్ గా ‘ఫలక్ నూమా దాస్’ అనే సినిమాతో తనని తానూ నిరూపించుకున్నాడు ఈ కుర్ర హీరో.అంత చిన్న వయస్సులో కేవలం రెండవ సినిమాతోనే ఇంత అద్భుతంగా ఒక సినిమాకి దర్శకత్వం వహించి, నటించడం అంటే మాటలు కాదు.ఇప్పుడు మరోసారి ఆయన హీరో గా నటిస్తూనే డైరెక్టర్ గా, నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’.ఈ చిత్రం ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.కచ్చితంగా ఈ సినిమాతో మరో లెవెల్ కి చేరుకుంటాను అనే కసితోనే ఈ చిత్రాన్ని చేసాడు.మరి ప్రేక్షకులను ఆయన అలరించాడా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :

కృష్ణ దాస్ ( విశ్వక్ సేన్) అనే వ్యక్తి ఒక స్టార్ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు.తన స్నేహితులతో కలిసి మధ్యతరగతి జీవితాన్ని గడిపే కృష్ణ దాస్ కీర్తి( నివేత పేతురాజ్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడుతాడు.ఆమెని కూడా ప్రేమలో దింపడానికి తాను ఒక కోటీశ్వరుడి లాగ ఆమె నటిస్తూ మోసం చేస్తాడు.ఇది ఇలా ఉండగా అచ్చు గుద్దినట్టు కృష్ణ దాస్ లాగానే ఉన్న సంజయ్ రుద్ర అనే వ్యక్తి ఒక పెద్ద ఫార్మా కంపెనీ కి అధినేత.ఆయన క్యాన్సర్ కి డ్రగ్ ని కనిపెట్టడానికి పోరాడుతూ ఉంటాడు.అందుకోసం ఒక 10 వేల కోట్ల డీల్ కొరకు ధనుంజయ్ ( అజయ్) పోరాడుతూ ఉంటాడు సంజయ్.అయితే కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల సంజయ్ స్థానం లోకి వస్తాడు దాస్.ఆ తర్వాత వీళ్లిద్దరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే స్టోరీ.

విశ్లేషణ :

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కృష్ణ దాస్ క్యారక్టర్ ని చాలా చక్కగా రాసుకున్నాడు విశ్వక్ సేన్.మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ ని జోడించి పర్వాలేదు యావరేజి గా ఉంది అనే ఫీలింగ్ ని రప్పించాడు.హీరోయిన్ నివేత థామస్ తో లవ్ ట్రాక్ రొటీన్ అయ్యినప్పటికీ కూడా కమర్షియల్ కోణం లో చూస్తే పర్వాలేదు అనే అనిపిస్తుంది.అయితే సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పింది అనే చెప్పాలి.అర్థం లేని ట్విస్టులతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు విశ్వక్ సేన్.మధ్యలో హైపర్ ఆది కామెడీ కాస్త రిలీఫ్ అనిపిస్తాది.రావు రమేష్ పాత్ర కూడా బాగుంది.అయితే విశ్వక్ సేన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించకుండా, కేవలం హీరో గా చేసి ఉంటే ఫలితం ఇంకా కాస్త బెటర్ గా ఉండేది అని చూసిన ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.కమర్షియల్ సినిమా కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

చివరి మాట :

ఆశించిన స్థాయిలో అయితే లేదు కానీ, విశ్వక్ సేన్ మార్కు యాక్టింగ్ ని నచ్చే ప్రేక్షకులకు , కమర్షియల్ సినిమా లవర్స్ కి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనే అనుభూతిని కలిగిస్తుంది.

రేటింగ్ : 2.25 /5