Virat Kohli IND vs PAK : టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాల్సిన మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్ కోహ్లీ. హార్ధిక్ పాండ్యా సాయంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. పాకిస్తాన్ మీద నాలుగు వికెట్ల తేడాతో గెలిపించాడు. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి చివరివరకూ ఉండి భారత్ ను గెలిపించాడు. హార్ధిక్ పాండ్యా(40)తో కలిసి శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను చివరి వరకూ క్రీజులో ఉండి గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

మ్యాచ్ ను గెలిపించిన అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఇదొక అద్భుతమైన వాతావరణం.. ఇలాంటి సమయంలో మాటలు రావడం లేదు. ఇది ఎలా జరిగిందో ఐడియా కూడా రావడం లేదు. ఎందుకంటే నేను పదాలు మరిచిపోయా.. మనం సాధించగలమని హార్ధిక్ నమ్మాడు. చివరి వరకూ క్రీజులో ఉంటే సాధ్యమేనని అనుకున్నాం.. పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసిన షహీన్ షా అఫ్రిదిని టార్గెట్ చేయాలని భావించాం. అలాగే హారిస్ రవూఫ్ వారికి చాలా కీలక బౌలర్. ఒక్కసారి హారిస్ ను ఎటాక్ చేస్తే తప్పకుండా పాక్ ఒత్తిడికి గురి అవుతుందని తెలుసు. చివరి ఓవర్ నవాజ్ వేస్తాడు అని ముందే అనుకున్నాం.. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన తరుణంలో రెండు సిక్సులు కొట్టడం తేలిక చేసింది. మరీ ముఖ్యంగా చివరి బంతికి సిక్సర్ వెళ్లడం నిజంగా అద్భుతమే. దీంతో 6 బంతుల్లో లక్ష్యం 16కి చేరింది. నా శక్తిసామర్థ్యం మీద నమ్మకం ఉంచా’నని కోహ్లీ విజయం అనంతరం పాక్ ను ఎలా మట్టికరిపించింది వివరించాడు.
‘ఇప్పటివరకూ మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్ నా అత్యుత్తమంగా ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి తాజా ఇన్నింగ్స్ వచ్చి చేరింది. హార్ధిక్ చాలా మద్దతుగా నిలిచాడు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం అద్భుతం.. అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ కోహ్లీ ముగించాడు.
ఒకానొక సమయంలో విజయం దక్కదేమోనని భయపడ్డ విరాట్ కు పక్కనున్న హార్ధిక్ ధైర్యంచెప్పాడని అర్థమైంది. విజయంపై హార్ధిక్ నమ్మకంగా ఉండి విరాట్ ను నడిపించాడని తెలుస్తోంది. నిజంగా విరాట్ చేసిన ఈ మాయ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక మరుపురాని విజయం అని చెప్పొచ్చు.
https://www.youtube.com/watch?v=R-SFGMSVsLs