
Viral Video Of Crow: కాకి గురించి చాలా కథలే చదువుకున్నాం. పక్షులు కూడా మనుషులలాగే ఆలోచిస్తాయని మనకు తెలియదు. మనం డబ్బు కనిపిస్తే చాలు చేయికి పని చెప్పి దొంగతనం చేస్తుంటారు. కానీ అది మానవనైజం. కానీ పక్షులు చేస్తే దాన్ని ఏమంటారు. అలాంటి ఓ విచిత్ర సంఘటనే చోటుచేసుకుంది. కాకి నీళ్ల కోసం కుండలో రాళ్లు వేసి నీరు పైకి వచ్చిన తరువాత తాగిందని గతంలో పుస్తకాల్లో చదువుకున్నాం. కాకి చేసే చిత్రమైన సంఘటనలు చూస్తూ ఉండిపోతాం.
కాకి నోట్లను దొంగతనం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను నెటిజన్లు సైతం వీక్షిస్తున్నారు. డబ్బు దొంగతనం చేయడం మనుషులకే అలవాటు. కానీ ఓ కాకి కూడా తన ముక్కుతో కరెన్సీ నోట్లను నోట కరుచుకుని రావడం చూస్తుంటే వింత గొలుపుతోంది. తెలివైన కాకి గురించి ప్రస్తుతం నెట్టింట్లో సందడి నెలకొంది. వీడియో వైరల్ అవుతోంది. వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.
కాకి కిటికీ ద్వారా ఒక ప్లాట్ లోకి చొరబడి అందులో టేబుల్ పై వాలి దాని డెస్క్ లో ఉన్న కరెన్సీ నోట్లను ముక్కుతో కరుచుకుని గాల్లో ఎగిరి పోతోంది. ఈ దృశ్యాలను నెట్లో పెట్టగా చాలామంది లైకులు కొడుతున్నారు. తొమ్మిది గంటల క్రితం అప్ లోడ్ చేసిన వీడియోను నెటిజన్లు ఇష్ట పడుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో కాకి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నెటిజన్లు విచిత్రమైన రీతిలో పోస్టులు పెడుతున్నారు. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. కాకిని ఏటీఎంగా ఉపయోగించుకుంటానన్నారు. కాకులు ఇలాగా కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. పక్షులతో జాగ్రత్తగా ఉండాలని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కాకి మాత్రం ప్రస్తుతం ఇంటర్ నెట్ లో షేర్ చేస్తుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.