Super Star Krishna Passed Away: కృష్ణ భౌతికకాయం వద్ద ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణా సీఎం కేసీఆర్ నటుడు నరేష్ కి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణ మరణానంతరం ఆయన పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలో గల నివాసానికి తీసుకొచ్చారు. చిత్ర ప్రముఖులు సందర్శనార్ధం అక్కడకు వెళ్లడం జరిగింది. ప్రముఖులను రిసీవ్ చేసుకోవడం, నివాళులు అర్పించడానికి అవసరమైన పూలు ఇవ్వడం వంటివి నరేష్ చూసుకున్నారు. తీవ్ర వేదనలో ఉన్న మహేష్ ఒక ప్రక్కన నిల్చున్నారు. ఈ క్రమంలో కృష్ణ భౌతిక కాయం వద్ద స్టెప్ సన్ నరేష్ ఓవర్ యాక్షన్ ఎక్కువైందనే వాదన మొదలైంది.

తన డేటింగ్ పార్టనర్ పవిత్ర లోకేష్ తో కలిసి ఆయన అక్కడ కలియతిరగండి ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. కాగా నరేష్ కి సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తుంది. కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ మహేష్ పక్కనే కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో నరేష్ కేసీఆర్ కి ఏదో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపు విన్న కేసీఆర్ ఇక నువ్వు ఆపు అన్నట్లు నరేష్ చేయిని పట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నరేష్ ఓవర్ యాక్షన్ కి కేసీఆర్ చిరాకు పడ్డారని, నువ్వు ఆపు అని సున్నితంగా హెచ్చరించారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. ఎందుకంటే ఆ వీడియోకి ఆడియో లేదు. ఇక నరేష్ యాంటీ వర్గం ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. నరేష్ కి కేసీఆర్ ఝలక్ ఇచ్చాడంటూ చెప్పుకుంటున్నారు. నరేష్ అక్కడ కలియ తిరగడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే కృష్ణతో నరేష్ కి ఉన్న అనుబంధం అలాంటిది.

నరేష్ ఆయనకు స్టెప్ సన్ అయినప్పటికీ కృష్ణ వద్దే పెరిగారు. ఎందుకంటే విజయనిర్మల కృష్ణ జీవితంలోకి వచ్చాక నరేష్ ఆయన వద్దే ఉన్నారు. మహేష్ తల్లి ఇందిరా దేవితో కంటే కృష్ణ విజయనిర్మలతోనే ఎక్కువ సమయం గడిపారు. కాబట్టి నరేష్ కృష్ణ వద్దే పెరిగారు. నరేష్, కృష్ణ ఒక ఫార్మ్ హౌస్లో ఉండేవారని సమాచారం. నరేష్-పవిత్ర లోకేష్ తో కాపురం పెట్టింది అక్కడే. కాగా స్టెప్ సన్ నరేష్ కి కృష్ణ ఎలాంటి ఆస్తి ఇవ్వలేదని, విజయనిర్మల ద్వారా వచ్చిన ఆస్తి మాత్రమే అతనికి దక్కింది అంటున్నారు.
https://twitter.com/vpjkam/status/1592718374756179969