https://oktelugu.com/

వైరల్: కన్నీళ్లు పెట్టుకున్న సోనూ సూద్

సోనూ సూద్.. ఈ పేరు వినగానే భారతీయుల గుండె ఉప్పొంగుతోంది. నిస్వార్థంతో కరోనా లాక్ డౌన్ వేళ వేల మంది వలస కార్మికులను.. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు సొంత ఖర్చుతో తీసుకొచ్చిన మహానుభావుడు ఈ నటుడు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోనూసూద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆపన్నులకు ఆపన్నహస్తం అందిస్తూనే ఉంటాడు. కరోనా సోకి ఐసోలేషన్ ఉన్నా కూడా సోనూ సూద్ తన టీం ద్వారా ఈ సాయాన్ని అందించడం మరువలేదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2021 / 06:26 PM IST
    Follow us on

    సోనూ సూద్.. ఈ పేరు వినగానే భారతీయుల గుండె ఉప్పొంగుతోంది. నిస్వార్థంతో కరోనా లాక్ డౌన్ వేళ వేల మంది వలస కార్మికులను.. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు సొంత ఖర్చుతో తీసుకొచ్చిన మహానుభావుడు ఈ నటుడు.

    సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోనూసూద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆపన్నులకు ఆపన్నహస్తం అందిస్తూనే ఉంటాడు. కరోనా సోకి ఐసోలేషన్ ఉన్నా కూడా సోనూ సూద్ తన టీం ద్వారా ఈ సాయాన్ని అందించడం మరువలేదు.

    తాజాగా సోనూసూద్ ‘కలర్స్ ’ టీవీ నిర్వహించిన ఓ డ్యాన్స్ షోకు ప్రత్యేక అతిథిగా వెళ్లాడు. అక్కడ డ్యాన్సర్లు అంతా కూడా సోనూ సూద్ చేసిన సాయంపై ఓ డ్యాన్స్ పర్ ఫామెన్స్ చేశారు.

    సోనూసూద్ చేసిన సేవలు తెలిసేలా ప్రతి బిట్టు బిట్టూ ఆయన మంచిపనులతో డ్యాన్సర్లు చేసిన ప్రత్యేక డ్యాన్స్ షో చూసి సోనూ సూద్ భావోద్వేగానికి గురయ్యారు. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

    ఇక ఒక చిన్న మురికవాడ నుంచి వచ్చి డ్యాన్స్ చేసిన ఓ యువకుడి పేదరికాన్ని చూసి ఆ స్లమ్ నే దత్తత తీసుకొని సౌకర్యాలు కల్పిస్తానని సోనూ సూద్ పేర్కొన్నాడు. దీంతో ఆ వేదిక చప్పట్లతో మారుమోగిపోయింది. సోనూ సూద్ లోని మంచి మనసు మరోసారి బయటపడినట్టైంది.