Viral Photo:ఈ మధ్య సోషల్ మీడియాలో ఫొటో ఫజిల్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక అందమైన ఫొటోను షేర్ చేసి అందులో ఒక జంతువు దాగి ఉందని మీ కంటికి పరీక్ష పెడుతున్నారు. చాలా మంది అందులోని ఆసక్తికర ఆ అంశాన్ని కనుగొనేందుకు తెగ శోధిస్తున్నారు. కొన్ని సార్లు మన కళ్ల ముందున్నదే అయినా కూడా దాన్ని గుర్తించలేకపోతున్నాం..

ఇంట్లోని వస్తువులే మనం పెట్టినవే మనకు కనిపించవు. వాటి కోసం చాలా వెతకాల్సి వస్తుంది. అలాంటి ఈ ఫజిల్ లు కనిపెట్టడం చాలా కష్టమే. కంటిచూపుకు ఇది పరీక్ష పెడుతుంది. కొంచెం కష్టం అయినా కూడా వెతకడం ఆపకుండా కొందరు కష్టపడుతూనే ఉంటారు.
తాజాగా వైరల్ అవుతున్న ఫొటో మీ కంటికి పరీక్ష పెడుతోంది. ఆ ఫొటోలో ఒక అడవి పిల్లి దాగి ఉంది. అయితే అది ఎవరూ గుర్తు పట్టలేని స్థితిలో అందులో ఇమిడిపోయి ఉంది. చాలా జాగ్రత్తగా దాక్కొని మనవైపే చూస్తోంది. దీనిని కనిపెట్టేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ అడవిపిల్లి జాడ మాత్రం దొరకడం లేదు.
బర్డింగ్ బీజింగ్ అనే ట్విట్టర్ వినియోగదారు తాజాగా ఈ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఒక అడివి పిల్లి దాగి ఉంది. దమ్ముంటే దాన్ని కనిపెట్టండి అంటూ సవాల్ చేశారు. మీరూ దాన్ని కనిపెట్టండండి చూద్దాం..
You’ve all played spot the Snow Leopard. Now let’s play spot the Pallas’s Cat. It’s no wonder these cats are hard to see in the wild. Photo by 徐征泽. pic.twitter.com/a1mnv5Uz1w
— Wild Beijing 北京自然 (@BirdingBeijing) March 6, 2022