Ustad Bhagat Singh- Vijay Sethupathi: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లోకి విజయ్ సేతుపతి..? ఖరారు అయితే ఫ్యాన్స్ కి పండగే!

Ustad Bhagat Singh- Vijay Sethupathi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై ఇటు అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ చిత్రం మొదలుకాకముందే ట్రేడ్ లో భారీ అంచనాలు ఉండేవి.అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ […]

Written By: Vicky, Updated On : April 14, 2023 9:32 am
Follow us on

Ustad Bhagat Singh- Vijay Sethupathi

Ustad Bhagat Singh- Vijay Sethupathi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై ఇటు అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ చిత్రం మొదలుకాకముందే ట్రేడ్ లో భారీ అంచనాలు ఉండేవి.అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకుంది.

మొదటి షెడ్యూల్ ఈరోజుతో పూర్తి అవుతుంది,ఈ మొదటి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొన్నది.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన మరో క్రజ్య్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది.అదేమిటంటే ఈ చిత్రం లో తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక పవర్ ఫుల్ పాత్రని పోషించబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే డైరెక్టర్ హరీష్ శంకర్ చెన్నై కి వెళ్లి విజయ్ సేతుపతిని కలిసి ఈ చిత్రం లో నటించాల్సిందిగా కోరారని, ఆయన కూడా ఈ చిత్రం లో నటించడానికి ఆసక్తి చూపించాడని, ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్.విజయ్ సేతుపతి ఎంత గొప్ప నటుడో మన అందరికీ తెలిసిందే, అలాంటి నటుడు పవర్ స్టార్ సినిమాలో నటించడం వల్ల అంచనాలు మరింత పెరుగుతాయి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనుంది.

Ustad Bhagat Singh- Vijay Sethupathi

తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన విజయ్ తేరి మూవీ స్టోరీ లైన్ ని అడాప్ట్ చేసుకొని, పూర్తిగా తన సరికొత్త స్టైల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు హరీష్ శంకర్.గబ్బర్ సింగ్ కి పది రెట్లు అద్భుతంగా ఉండేలా ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట, మరి ఔట్పుట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అనేది చూడాలి.