Vijay Divorce: ఈ మధ్య రష్మిక మందాన వివాదాలతో కాపురం చేస్తుంది. ఒక ప్రక్క ఎఫైర్ రూమర్స్ మరో ప్రక్క కన్నడ పరిశ్రమతో గొడవలు అంటూ ఆమె వార్తలకెక్కింది. ఇవి చాలవన్నట్లు కొత్తగా మరో అపవాదు ఆమెపై పడింది. హీరో దళపతి విజయ్ భార్యతో విడిపోతున్నాడన్న న్యూస్ కోలీవుడ్ ని ఊపేస్తోంది. కొద్ది రోజులుగా ఈ వార్త పతాక శీర్షికల్లో కనిపిస్తుంది. ఇటీవల వారిసు ప్రీరిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. విజయ్ ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భార్య సంగీత సూర్నలింగం హాజరువుతారు. వారిసు ఈవెంట్ కి ఆమె హాజరు కాలేదు. ఇక ఈవెంట్లో ఆద్యంతం విజయ్ సీరియస్ గా కనిపించారు.

సంగీతతో విజయ్ కి మనస్పర్థలు తలెత్తాయని అంటున్నారు. ఈ గొడవలకు కారణం రష్మిక మందానే అని లేటెస్ట్ న్యూస్. వారిసు షూటింగ్ లో రష్మిక విజయ్ కి దగ్గరయ్యారని… వీరి సాన్నిహిత్యం గురించి తెలిసిన సంగీత విజయ్ పై కోపంగా ఉన్నారని కొన్ని మీడియా కథనాలు ప్రచురించాయి. దీంతో సంగీత అనుమానిస్తునట్లే… రష్మిక-విజయ్ మధ్య ఏదైనా వ్యవహారం నడుస్తుందా? లేక ఆమె అపార్థం చేసుకుంటున్నారా? అని జనాలు ఆలోచనలో పడ్డారు.
ఆల్రెడీ విజయ్ దేవరకొండతో పీకల్లోతు ప్రేమలో రష్మిక ఉందని టాక్. ఈ జంట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు. వేరువేరుగా వెళ్లినప్పటికీ వారు అక్కడ కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారు. దీనికి ఆధారాలు కూడా లభించాయి. హోటల్ గదిలో కూర్చొని రష్మిక ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేశారు. ఈ వీడియో చాటింగ్ లో బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. అంటే రష్మిక గదిలో విజయ్ దేవరకొండ ఉన్నాడని రుజువైంది. పలుమార్లు మీడియా విజయ్ దేవరకొండ-రష్మిక ఎఫైర్ పై వార్తలు రాశాయి. అయితే వాటిని ఇద్దరూ ఖండించారు.

అనూహ్యంగా టాలీవుడ్ విజయ్ కాదు కోలీవుడ్ విజయ్ తో ఆమె ఎఫైర్ అంటూ మరో రచ్చ మొదలైంది. మరి ఈ వార్తలపై రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి. కెరీర్లో మొదటిసారి విజయ్ తో రష్మిక జతకట్టారు. తెలుగులో వారిసు… వారసుడిగా విడుదల చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతుండగా అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు.