Viral Video: ఈ ప్రపంచంలో వృధా అనే వస్తువు ఉండదు.. కాకపోతే దానిని ఎలా వాడుకోవాలో తెలిసి ఉండాలి. అలాంటి పని ఈ అక్క చేసింది. ఆ పని మామూలుది కాదు. అసలు ఈ అక్క డిక్షనరీలో వృధా అనే పదమే లేదనుకుంటా. దేనినీ వృధా కానవ్వదనుకుంటా. పైగా తన చేసిన పని విషయంలో ఆమె ఏమాత్రం సిగ్గుపడలేదు. పదిమంది ఏమనుకుంటారోనని భయపడలేదు. తను చేసిన పనిని నిర్మొహమాటంగా బయటపెట్టుకుంది. తన పని తాను చేసుకుంటూ పోయింది.
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ మహిళ కూరగాయలు కొనుగోలు చేయడానికి మార్కెట్ కు వచ్చింది. అక్కడ తనకు నచ్చిన కూరగాయలు కొనుగోలు చేసింది. కూరగాయలు అమ్మే వ్యక్తి వాటి బరువు తూచి.. ఆమె తెచ్చిన సంచిలో పోయడం మొదలుపెట్టాడు. వాస్తవానికి ఆ సంచి దూరం నుంచి చూస్తే మామూలుగానే ఉంది. దగ్గరికి వెళ్తే గాని అందులో అద్భుతం అర్థం కాలేదు. అది వాళ్ళ ఆయన అండర్వేర్. అండర్వేర్ ఉపయోగించిన తర్వాత అలా పడేయడం ఇష్టం లేక.. చిరుగులు ఉన్న ప్రాంతాన్ని మొత్తం తొలగించింది. మిగతా వస్త్రంతో ఏకంగా ఒక సంచి కుట్టుకుంది. ఆ సంచిని కూరగాయలు కొనుగోలు చేయడానికి తీసుకొచ్చింది. కూరగాయలు కొనుగోలు చేసి ఆ సంచిలో పోసుకుంది. దీనిని ఎవరో దూరం నుంచి వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలోకి ఎక్కించారు.
ఈ వీడియో కాస్త చిత్రంగా ఉండడం.. పైగా అండర్వేర్ తో సంచి కుట్టించడంతో జనాలు తెగ నవ్వుకుంటున్నారు. ఇలా కూడా చేస్తారా అనుకుంటూ తమలో తామే ఆశ్చర్యపోతున్నారు. సంచులు కుట్టించడానికి ఆమెకు వస్త్రాలే దొరకలేదా.. భర్త వాడిన అండర్వేర్ తోనే ఇలాంటి సంచి కుట్టించాలా అంటూ తమలో తామే ప్రశ్నించుకుంటూ నవ్వుకుంటున్నారు.. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది. అదే స్థాయిలో లైక్ లు కూడా దక్కించుకుంది.