Venu Swamy: సినిమా వాళ్లలో కొందరు జాతకాలను ఎక్కువగా నమ్ముతారని అంటారు. తాము ఇండస్ట్రీలో ఎదగడానికి ఎలాంటి పూజలు చేయాలో జ్యోతిష్యులను సంప్రదిస్తారట. ఇలా కొందరు సినీ నటులు తన దగ్గరికి రావడంతో వారికి మంచి సూచనలు, సలహాలు ఇచ్చానని.. నా వల్లే ఇప్పుడు కొందరు స్టార్లు గా మారారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో చిత్ర పరిశ్రమలో ఆయన పేరు మారుమోగుతోంది.ఇక కొందరు సినిమా నటుల గురించి వారు అడగకపోయినా, వారి జాతకాన్ని చెబుతున్నాడు వేణు స్వామి. వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామి మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆయన ఓ హీరో, హీరోయిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరు త్వరలో చనిపోతారు అని చెప్పడంపై తీవ్ర చర్చ సాగుతోంది.

కొన్ని నెలల కిందట నాగచైతన్య, సమంతలు విడిపోయిన విషయం తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న నాలుగేళ్ల తరువాత వీరు దూరమయ్యారు. అయితే ఈ విషయాన్ని చైతూ, శ్యామ్ లు పెళ్లి చేసుకున్న సమయంలోనే వేణు స్వామి చెప్పారు. వీరి జాతకాల ప్రకారం ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు.. త్వరలో విడిపోతారు.. అని చెప్పాడు. అది నిజం కావడంతో వేణు స్వామిపై చాలా మందికి నమ్మకం పెరిగిపోయింది. దీంతో మంజి పోజిషన్లోకి రావడానికి కొందరు నటులు వేణుస్వామిని సంప్రదించారట.
వీరిలో రష్మిక మందానా ఉన్నట్లు సమాచారం. ఈమె వేణు స్వామి దగ్గర సలహాలు తీసుకొని కొన్ని ప్రత్యేక పూజలు చేయడంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిందని అంటున్నారు. లేటెస్టుగా కృతి శెట్టి కూడా వేణు స్వామిని సంప్రదించినట్లు సమాచారం. తాజాగా వేణుస్వామి అందరూ షాక్ తినే కామెంట్లు చేశారు. సినిమా పరిశ్రమకు చెందిన ఓ హీరో, హీరోయిన్ త్వరలో చనిపోతారని అన్నాడు. వారిద్దరు ఒకే సమయంలో మరణిస్తారని వేణు స్వామి చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

అయితే వేణుస్వామి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. నువ్వేమైనా దేవుడివా…? అందరి జీవితాల గురించి చెప్పేందుకు..? అని కామెంట్లు పెడుతున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఇమ్మంది రామారావు మాట్లాడుతూ నాగచైతన్య, సమంతలది పర్సనల్ సమస్య. అందుకే విడిపోయారు. ఇప్పుడు ఓ హీరో, హీరోయిన్ చనిపోతారని నువ్వెలా చెబుతావ్..? అంటూ ప్రశ్నించారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా వేణు స్వామి కామెంట్స్ పై సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఆయన చెప్పిన హీరో, హీరోయిన్ ఎవరా..? అని చర్చించుకుంటున్నారు.