Homeఎంటర్టైన్మెంట్Veera Simha Reddy Collections: 'వీర సింహా రెడ్డి' 4 రోజుల వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి...

Veera Simha Reddy Collections: ‘వీర సింహా రెడ్డి’ 4 రోజుల వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి ఆమడదూరంలో !

Veera Simha Reddy Collections: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే..మొదటి రోజు ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్ టాలీవుడ్ లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది..ఎందుకంటే అమెరికా నుండి అనకాపల్లి వరకు ఈ సినిమాకి వచ్చినటువంటి ఓపెనింగ్స్ బాలయ్య తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నడూ చూడలేదు.

Veera Simha Reddy Collections
Veera Simha Reddy Collections

‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన బాలయ్య సినిమా కావడం, దానికి తోడు ‘అన్ స్టాపబుల్’ షో కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడం వల్లే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటున్నారు విశ్లేషకులు..ఇదే రేంజ్ ఊపుని లాంగ్ రన్ వరకు కొనసాగిస్తుందేమో అని అందరూ అనుకున్నారు..కానీ సీన్ రివర్స్ అయ్యింది..ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదలైందో అప్పటి నుండే ఈ చిత్రం కలెక్షన్స్ బాగా పడిపోయాయి.

చిన్నపిల్ల దగ్గర నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతీ ఒక్కరు ‘వాల్తేరు వీరయ్య’ కి ఎక్కువ మొగ్గు చూపించడం వల్ల ‘వీర సింహా రెడ్డి’ వసూళ్లు పల్చబడ్డాయి..మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి రెండవ రోజు కేవలం 5 కోట్ల 50 లక్షలు మాత్రమే వచ్చాయి..భోగి పండుగ రోజు కూడా ఈ సినిమాకి ఆశించిన స్థాయి వసూళ్లు పెద్దగా రాలేదు, కేవలం 6 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది..సంక్రాంతి పండుగ రోజు కూడా అంతంత మాత్రమే వచ్చాయి..నాల్గవ రోజు కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Veera Simha Reddy Collections
Veera Simha Reddy Collections

అలా మొత్తం మీద నాలుగు రోజులకు కలిపి 50 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ బాగా పడిపోయాయి..ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 75 కోట్ల రూపాయిల వరకు జరిగింది..బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వీక్ డేస్ లో బాగా ఆడాలి..కానీ పండుగ దినాల్లోనే ఇలా ఉంటె ఇక వీక్ డేస్ లో రన్ ఏముంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నమాట.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version