
Valentines Day: ప్రేమకు రూపం లేదు. అయితే దానికో ఈక్వేషన్ ఉంది. డోపమైన్ + సెరోటోనిన్ + ఆక్సిటోసిన్ = ప్రేమ. ఒకరిని చూసినప్పుడు మనిషి మెడలో ఈ రసాయనాలు విడుదలైతే అది ప్రేమకు దారి తీస్తుంది. మనసులో తెలియని అనుభూతి మొదలవుతుంది. ప్రేమ అనంతం. అది ఎవరినైనా ఆవహించి బానిసలుగా చేసుకుంటుంది. ఆ భావన గుండెలో మొదలవడానికి లక్ష కారణాలు ఉన్నాయి.
Also Read: Pathan Box Office Collection: 20 రోజుల్లో 1000 కోట్లు..చరిత్ర సృష్టించిన షారుక్ ఖాన్ ‘పఠాన్’
హీరో-హీరోయిన్ కథలో భాగంగా ప్రేమించుకుంటారు. ఒక సన్నివేశం పండేందుకు చెప్పే మాటలు, చేసే చర్యలు నిజమైన ప్రేమకు దారితీయవచ్చు. పెళ్లి పీటలెక్కిన సిల్వర్ స్క్రీన్ ప్రేమకథలు చాలానే ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం.. సూపర్ స్టార్ మహేష్-నమ్రత ప్రేమ వివాహం చేసుకున్నారు. వంశీ మూవీ సెట్స్ లో వీరి ప్రేమకు బీజం పడింది. 2005లో అత్యంత నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్య రహస్య వివాహం చేసుకున్నారు. 18ఏళ్లుగా అన్యోన్య దంపతులుగా కొనసాగుతున్నారు.
హీరో అజిత్ హీరోయిన్ షాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అమర్ కాలం మూవీలో అజిత్-షాలిని కలిసి నటించారు. ఆ చిత్ర షూటింగ్ లో అజిత్ కారణంగా షాలిని చేతికి గాయమైందట. ఆ సమయంలో అజిత్ తన పట్ల చూపిన కేరింగ్ కి షాలిని పడిపోయారట. అలా మొదలైన ప్రేమ పెళ్ళికి దారితీసింది.
దర్శకుడు విగ్నేష్ శివన్-నయనతార దాదాపు 7 ఏళ్ళు ప్రేమించుకున్నారు. విగ్నేష్ దర్శకత్వంలో నానుమ్ రౌడీదాన్ మూవీలో నయనతార ప్రధాన పాత్ర చేశారు. ఆ సమయంలో వారి మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2022లో నయనతార-విగ్నేష్ వివాహం జరిగింది. వీరికి కవుల అబ్బాయిలు సంతానంగా ఉన్నారు.

కోలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సూర్య-జ్యోతిక. పూవెల్లం కెట్టుపర్ మూవీలో కలిసి నటించిన సూర్య-జ్యోతిక ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. ఒక ప్రక్క సినిమాలు, మరోప్రక్క సమాజ సేవ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు.
అక్కినేని నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మీతో విడాకులు అయ్యాక రెండో వివాహంగా అమలను పెళ్లి చేసుకున్నారు.
రన్బీర్ కపూర్ తో లవ్ బ్రేకప్ కారణంగా దీపికా మానసిక ఒత్తిడిలోకి జారుకున్నారు. ఆ సమయంలో ఆమెకు అండగా నిలిచాడు రణ్వీర్ సింగ్. ఈ జంట 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది అలియా భట్-రన్బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గత మూడేళ్ళుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా సిల్వర్ స్క్రీన్ పై మొదలైన ప్రేమకథలకు అందమైన ముగింపు పలికారు.
Also Read: Nandamuri Kalyan Ram: వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్… కళ్యాణ్ రామ్ కెరీర్ మళ్ళీ మొదటికి!