Uttar Pradesh – Mainpuri : చంద్రముఖి.. ఈ సినిమాలో.. గంగను చంద్రముఖి ఆవహించడంతో గంగ పూర్తిగా చంద్రముఖిలా ప్రవర్తిస్తుంది. పగ తీర్చుకోవడానికి చంద్రముఖి ఇలా చేస్తుంది. కానీ ఇక్కడ ఓ మనుమడు తన తాతలా మారిపోయాడు. అమ్మమ గత జన్మలో తన భార్య అని, తల్లి తన కూతురు అని, మేనమామలిద్దరూ తన కొడుకులని చెబుతున్నాడు. ఆ బాలుడి మాటలకు కుటుంబసభ్యులంతా ఆశ్చర్యపోతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఎనిమిదేళ్ల బాలుడు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఎనిమిదేళ్ల కుర్రాడు పూర్వజన్మ గురించి చెబుతున్నాడు. 2015, జనవరి 9న ఈ బాలుడి తాత మనోజ్‌మిశ్ర చనిపోయారు. రతన్ఊపూర్లో పొలానికి నీరు పారించేందుకు వెళ్లి పాముకాటుకు గురై మృతిచెందాడు. ఆ సమయంలో మనోజ్ కుమార్తె రంజన నిండుగర్భిణి. మనోజ్ చనిపోయిన 20 రోజులకు ఆమెకు ఆర్యన్ పుట్టాడు.
తాతను చూడకపోయినా.. తాతలా..
ఎనిమిదేళ్ల తర్వాత ఆ బాలుడే ఇప్పుడు తానే మనోజ్‌మిశ్ర అంటున్నాడు. జూన్ 15న అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్ విచిత్రంగా ప్రవర్తించాడు. తన పేరును మనోజ్‌గా చెప్పుకొన్నాడు. అది చూసి ఆర్యన్ మేనమామలు.. కన్నీరుమున్నీరుగా విలపించారు. తన పేరిట బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయని ‘ఆర్యన్’ చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే మనోజ్ గురించి ఆర్యన్‌కు పెద్దగా తెలియదు. ఆయన పుట్టకుముందే మనోజ్ చనిపోయాడు. కానీ, ఇప్పుడు మనోజ్‌లా మారిపోయిన ఆర్యన్‌ను చూసి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యన్ ఇంటికి వచ్చి మనోజ్ గురించి విషయాలను అడుగుతున్నారు. ఆర్యన్ గుక్కతిప్పుకోకుండా సమాధానాలు చెబుతుండడంతో ముక్కున వేలేసుకొంటున్నారు.
ఎందుకిలా?
మెమొరీ లాస్ అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం. మరపు అనేది లేకుంటే మనిషి జీవితంలో ఆనందం అనేది ఉండదు. సన్నిహితులు దూరం అయినప్పుడు వారి జ్ఞాపకాలు మనలో కొన్ని మిగిలి ఉంటాయి. అవి మెదడులో నిక్షిప్తం అయి ఉంటాయి. కానీ చాలా అరుదుగా అవి బయట పడతాయి. కానీ ఇక్కడ ఆర్యన్ విషయంలో మాత్రం మెమరీ రికవరీ అవుతోంది. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. వయసు పెరిగే కొద్దీ ఆర్యన్ అన్నీ మర్చిపోతాడని పేర్కొంటున్నారు. ఆర్యన్ తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు మనోజ్ చనిపోవడం వలన తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉండం వలన అవి గర్భంలో ఉన్న బిడ్డపై పడ్డాయని పేర్కొంటున్నారు. మొత్తంగా ఆర్యన్ తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.