Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్… వంద మందిని విరగ్గొట్టిన పవన్!

Ustad Bhagat Singh: ఒకటికి నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. వినోదయ సితం రీమేక్ లో పవన్ కళ్యాణ్ పార్ట్ కొంత మేర షూట్ చేశారు. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. కాగా ఎనిమిది రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారట. ఈ షెడ్యూల్ నందు ఒక భారీ ఫైట్ […]

Written By: Shiva, Updated On : April 15, 2023 2:55 pm
Follow us on

Ustad Bhagat Singh

Ustad Bhagat Singh: ఒకటికి నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. వినోదయ సితం రీమేక్ లో పవన్ కళ్యాణ్ పార్ట్ కొంత మేర షూట్ చేశారు. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. కాగా ఎనిమిది రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారట. ఈ షెడ్యూల్ నందు ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ తో పాటు, చిన్న పిల్లలతో ఫన్నీ సీన్స్, హీరోయిన్ శ్రీలీలతో రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించారట.

ఫైట్ భారీ ఎత్తున రూపొందించినట్లు సమాచారం. వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్ట్స్ పాల్గొన్న ఈ ఫైట్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ వంద మంది ఫైటర్స్ తో పోరాడినట్లు సమాచారం. రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేసిన ఈ ఫైట్ సినిమాకు హైలెట్ కానుందట. ఇక దర్శకుడు హరీష్ శంకర్ స్పీడ్ చూస్తుంటే మూడు నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన చిత్రాలన్నీ అలానే ప్లాన్ చేశారు.

మరో ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. వీటి కోసం పవన్ కళ్యాణ్ సంసిద్ధం కావాలి. అందుకే ఆయన ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. దర్శకులు ముందుగా ఆయన పార్ట్ షూట్ చేసేలా షెడ్యూల్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక పవన్ నుండి వస్తున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ చాలా ప్రత్యేకం. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Ustad Bhagat Singh

హరీష్-పవన్ కళ్యాణ్ కాంబోలో 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ సినిమా వాళ్లకు పిచ్చ కిక్ ఇచ్చింది. పదేళ్ల అనంతరం వీరి కలయికలో మూవీ సాకారమైంది. గబ్బర్ సింగ్ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో కూడా పవన్ చెప్పే వన్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయన్న టాక్ వినిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.