
Uorfi Javed: బాలీవుడ్లో స్టార్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే గానీ.. ఆ స్టేజికి రాలేం. కానీ కొందరు విభిన్న తరహాలో ప్రవర్తించడం ద్వారా ఫేమస్ అవుతూ ఉంటారు. డ్రెస్సింగ్ విషయంలో తనకు మించిన వారేవరు లేరంటూ నిరూపిస్తోంది ఉర్పీ జావెద్. ఇటీవల ఆమె వేసుకున్న డ్రెస్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని కొందరు కుర్రాళ్లు లైక్ చేస్తుండగా..మరికొందరు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఉర్ఫీ జావెద్ కొన్ని సినిమాల్లో నటించినా.. బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది. కానీ ఆ గుర్తింపు మాములుగా రాలేదు. దాని వెనుక ఎంతో కష్టం ఉందని ఉర్ఫీ చెప్పుకొస్తుంది. మరి ఆమె పడిన కష్టాలేంటో తెలుసుకుందాం..
ఉర్ఫీ జావెద్ వేసుకున్న డ్రెస్సులపై చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఆమె గురించి తెలిశాక అయ్యో పాపం.. అంటున్నారు. 17 ఏళ్ల వయసులోనే ఉర్పీ ఇంట్లో నుంచి బయటకొచ్చింది. అంతకుముందు తన ఫొటో ఒక్కి ప్రొఫైల్ పిక్ గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందట. కానీ దీనిని ఎవరో ఫోర్న్ సైట్ లో పెట్టారట. దీంతో కొంతమంది గుర్తించి తనను ఫోర్న్ స్టార్ అని పిలిచేవారట. ఆ తరువాత ఇంట్లోవాళ్లకు ఈ విషయం తెలియడంతో కోపం తెచ్చుకున్నారు. తాను తప్పు చేయకున్నా వారితో గొడవ పడాల్సి వచ్చింది. చివరికి నాన్న కూడా తనను ఫోర్న్ స్టార్ గానే చూసేవారని ఉర్ఫీ చెప్పుకొచ్చంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండలేక వారికి చెప్పకుండా బయటకు వచ్చారు. ముందుగా లక్నో చేరుకున్న ఆమె పిల్లలకు ట్యూషన్స్ చెప్పి అద్దె కట్టేదట. ఆ తరువాత స్నేహితురాలి సాయంతో ఢిల్లీకి మకాం మార్చింది. కొన్ని రోజుల పాటు కాల్ సెంటర్లో పనిచేసి.. ఆ తరువాత ముంబయ్ కి వెళ్లింది. అక్కడ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆ సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ ద్వారా ఉర్ఫీ ఫేమస్ అయ్యారు.

ఆ తరువాత ఉర్ఫీ పేరు కొన్ని రోజుల పాటు మారుమోగింది. ఆ తరువాత ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే కొన్ని రోజుల నుంచి ఆమె విభిన్న డ్రెస్సులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ మధ్య తాళ్లతో కూడిన ఓ డ్రెస్ వేసుకున్న పిక్స్ వైరల్ గా మారాయి. ఇందులో ఆమె శరీరం మొత్తం కనిపించేలా ఉండడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అయితే అవన్నింటిని తట్టుకుని ఆమె ముందుకు సాగారు. అయితే ఆమె కష్టాలు విన్న తరువాత అయ్యోపాపం.. అంటున్నారు.