Unstoppable With NBK Pawan Kalyan: ఒక మామూలు టాక్ షో గా ప్రారంభం అయ్యి ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ క్రేజీ టాక్ షో గా మారిపోయింది నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..ఆహా మీడియా లో ప్రసారమవుతున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో కారణంగా ఆహా మీడియా ఇప్పుడు ఇండియాలోనే టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిలిచింది..రోజు రోజుకు ఈ యాప్ ని వాడేవాళ్లు సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది.

ఇక లేటెస్ట్ గా ప్రభాస్ ఎపిసోడ్ ని ఆహా మీడియా అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే..ఈ ఎపిసోడ్ కి కేవలం అభిమానుల నుండి మాత్రమే కాదు..ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..తొలుత ఈ ఎపిసోడ్ ని అప్లోడ్ చెయ్యగానే ఆహా యాప్ ని ప్రభాస్ అభిమానుల తాకిడి ని తట్టుకోలేక క్రాష్ అయ్యింది..మళ్ళీ లైవ్ చెయ్యడానికి చాలా సమయం పట్టింది.
అయితే ఇప్పుడు ప్రభాస్ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్స్ కి కేంద్ర బిందువుగా మారిపోయింది..ఇప్పటి వరకు ఆ ఎపిసోడ్ కి సంబంధించి దాదాపుగా కోటి వ్యూస్ వచ్చాయట..వారం రోజులు కూడా గడవకముందే ఇంతటి వ్యూస్ ని దక్కించుకున్న ఏకైక ఎపిసోడ్ గా ఇది సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాబోతుంది..ఈ ఎపిసోడ్ కి ఎలాగో రికార్డ్స్ వస్తాయి అనుకోండి ,అది వేరే విషయం.

కానీ ప్రభాస్ ఎపిసోడ్ కి వారం రోజుల్లో వచ్చిన ఈ కోటి వ్యూస్ రికార్డు ని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి..ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఎలాంటి ప్రోమో కూడా విడుదల కాలేదు..అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన స్ట్రీమింగ్ వివరాలు తెలియచెయ్యబోతుంది ఆహా మీడియా టీం..సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ చేస్తారని తెలుస్తుంది.