‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ అనే సీరియల్ చూసిన వారందరూ అందులో బాగా ఇష్టపడిన నటుడు బాలు (చందన్ కుమార్). సీరియల్ కూడా సూపర్ హిట్ అవడంతో బుల్లితెర ప్రేక్షకులకు బాలు హీరోగా కూడా బాగా దగ్గరయ్యాడు. అలాగే నటి కవిత గౌడ టీవీ సీరియల్స్ లో తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరోయిన్. మొత్తానికి ఈ హీరోహీరోయిన్లు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు
కరోనా నిబంధనలు అన్నీ పాటిస్తూనే, వీరిద్దరూ వివాహ బంధాన్ని ముడి వేసుకున్నారు. వీరి వివాహానికి కేవలం ఇరుకుంటుంబ సభ్యులు, అలాగే కొద్దిమంది మిత్రులు సన్నిహితుల మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహ వేడుకను నిన్న ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. 2013లో వచ్చిన కన్నడ లక్ష్మీ బారమ్మ అనే సీరియల్ లో మొదట వీరిద్దరూ కలుసుకున్నారు.
పైగా ఆ సీరియల్ లో చిన్ను, చందు అనే పాత్రల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పటినుండి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం, చివరకు అది ప్రేమగా మారడంతో దాదాపు ఏడేళ్లుగా చందన్, కవితలు డేటింగ్ చేస్తున్నారట. ఈ క్రమంలో తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి నిన్న ప్రేమ పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది ఈ జంట.
అయితే, ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరి పెళ్లి ఫోటోలు చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అందులో ఓ నెటిజన్ పెట్టిన మెసేజ్ ను తెగ షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు మిగిలినవారు. ఇంతకీ ఏమిటి ఆ మెసేజ్ అంటే.. ‘మాస్క్‌తో ఒక్కటైన జంట’ అంటూ చమత్కరిస్తూ ఓ కుర్రాడు కవ్వింపు మెసేజ్ పెట్టాడు.
ఇక ఈ కొత్త జంటకు సినీ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కరోనా ఆంక్షలు అన్ని ఎత్తివేసాక, అందరిని పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ నిర్వహించాలని ఈ హీరోహీరోయిన్లు ప్లాన్ చేసుకుంటున్నారు.