
TSPSC Paper Leak- SIT: తెలంగాణలో సంచలనంగా మారిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్ ఎక్వైరీ ఆశ్చర్యకరంగా సాగుతోంది. దోషులు ఎవరు.. లీకు వీరులు ఎవరు అనే విషయాలు తేల్చాల్సిన సిట్ అత్యుత్సాహంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసినవారిని విచారణలో ఇన్‌వాల్వ్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న విపక్ష పార్టీల నేతలకు నోటీ సులు జారీ చేయడం ప్రారంభించింది.
రేవంత్‌కు నోటీసులు..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ ఇప్పటికే 9 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది. మరోవైపు సిట్ నివేదిక మేరకే టీఎస్‌పీఎస్సీ కూడా గ్రూప్–1 ప్రిలిమ్స్ నుంచి నాలుగు పరీక్షలు రద్దు చేసింది. భవిష్యత్‌లో జరుగబోయే పరీక్షల ప్రశ్నపత్రాలూ మారుస్తామని ప్రకటించింది. అయినా ఈ లీకులో నిరుద్యోగుల్లో ఆందోళన తొలగడం లేదు. మరోవైపు విపక్షాలు లీకుల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తంపై ఆరోపణలు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేరుగా ఐటీ మంత్రి కేటీఆర్‌పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ పీఏ, బీఆర్‌ఎస్ నేతల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒకే గ్రామంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు క్వాలిఫై కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఐటీ మినిస్టర్ రాజీనామా చేసి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరోపణలు చేసినవారికి నోటీసులు..
ఇక సిట్ అరెస్టు చేసిన వారిని విచారణ చేసి వారి వెనుక ఉన్న పెద్దలను, ఇతర ముఠాలను బయటపెట్టి లక్షల మందిలో ఆందోళనను తొలగించాల్సిన సిట్.. ఇప్పుడు విచిత్రకరంగా విచారణ చేస్తోంది. 9 మందిని అదుపులోకి తీసుకున్న సిట్ ఒకవైపు వివరాలు సేకరిస్తూనే.. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విపక్షాలకు నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పుడు ఇదే తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఆరోపణల్లో వాస్తవాలు తెచ్చడానికి ప్రభుత్వం స్పందించాలి. కానీ సిట్ ఇందులో ఇన్‌వాల్వ్ కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. అంటే వెనుక ఉన్నవారిని బయటకు రాకుండా చేయాలనే సిట్ ఈ స్ట్రాటజీ మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇద్దరికే పరిమితం చేయాలని..
మరోవైపు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో విచారణను పరిమితం చేసిన కేవలం ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిని మాత్రమే బాధ్యులను చేయాలని సిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. వారి వెనుక ఉన్న పెద్దలు, టీఎస్‌పీఎస్సీ వైఫల్యాలు బయటకు రాకుండా చూస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ మొత్తం వ్యవహారం బయటకు రావాలంటేముందుకు ఐటీ అధికారులు, ఆ శాఖ మంత్రి, కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్, అడ్మినిస్ట్రేషన్ అధికారికి నోటీసులు ఇవ్వాలి. కానీ సిట్ నేతల వెంటపడడం అనుమానాలకు తావిస్తోంది.