https://oktelugu.com/

Mrunal Thakur- Nani: ట్రోల్ ఆఫ్ ది డే: మృణాల్ సేన్ ఠాకూర్ ను అలా చూసి నాని గుండె ముక్కలయిపోయింది

Mrunal Thakur- Nani: సీతారామం.. అందులో నటించిన దుల్కర్ సల్మాన్ కేరళ ప్రాంతానికి చెందినవాడు..మృణాల్ సేన్ ఠాకూర్ ఉత్తరాది అమ్మాయి..అయితేనేం హను రాఘవపూడి తీసిన ఆ చిత్రం ఓ దృశ్య కావ్యం లాగా నిలిచిపోయింది.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ గా దుల్కర్, సీతగా మృణాల్ సేన్ నటించారు అనేకంటే జీవించారు అనడం సబబు.. అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.. ఈ సినిమా దెబ్బకు మృణాల్ తెలుగింటి సీత అయిపోయింది.. వెంట వెంటనే […]

Written By:
  • Rocky
  • , Updated On : February 15, 2023 / 02:03 PM IST
    Follow us on

    Mrunal Thakur- Nani

    Mrunal Thakur- Nani: సీతారామం.. అందులో నటించిన దుల్కర్ సల్మాన్ కేరళ ప్రాంతానికి చెందినవాడు..మృణాల్ సేన్ ఠాకూర్ ఉత్తరాది అమ్మాయి..అయితేనేం హను రాఘవపూడి తీసిన ఆ చిత్రం ఓ దృశ్య కావ్యం లాగా నిలిచిపోయింది.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ గా దుల్కర్, సీతగా మృణాల్ సేన్ నటించారు అనేకంటే జీవించారు అనడం సబబు.. అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.. ఈ సినిమా దెబ్బకు మృణాల్ తెలుగింటి సీత అయిపోయింది.. వెంట వెంటనే అవకాశాలు ఒడిసి పట్టుకుంటున్నది. త్వరలో నానితో ఒక సినిమాలో నటించనుంది.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.. దసరా సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే సీతారామం సినిమాలో చాలా సంప్రదాయంగా కనిపించిన మృణాల్… ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది.

    మృణాల్ ను సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు వివిధ రకాల సీరియల్స్ లో నటించింది.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది..బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు సీతారామం సినిమాతో వచ్చింది.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా ఈ సినిమా ఇచ్చిన బ్రేక్ తో మృణాల్ ఆకాశాలను అందిపుచ్చుకుంటుంది..నానీ సినిమా నే కాకుండా మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది వరకు మృణాల్ కాల్ షీట్లు ఖాళీ ఉండవు. ఇక ఈమె 2018లో లవ్ సోనియా అనే సినిమా కోసం ముంబై వ్యభిచార గృహాల్లో ఉండాల్సి వచ్చింది. ఆ సినిమాలో ఈమె పాత్ర మహిళల అక్రమ రవాణా నుంచి తన చెల్లిని కాపాడే కోణంలో ఉండడంతో.. తన పాత్ర మరింత రియలిస్టిక్ గా రావాలి అనే ఉద్దేశంతో ముంబైలో వ్యభిచార గృహాల్లో కొద్ది రోజులపాటు ఉంది.. అక్కడి పరిస్థితులను చూసి డిప్రెషన్ కు గురి అయింది.

    Mrunal Thakur- Nani

    ఇక మొన్నటిదాకా మృణాల్ సేన్ సంప్రదాయ పద్ధతిలో కనిపించేది. ఇప్పుడు ఆ హద్దులను మొత్తం చేరిపేసింది . కురచ దుస్తుల్లో కనిపించడం మొదలు పెట్టింది. తనలోనూ విపరీతమైన హాట్ నెస్ ఉందని ప్రేక్షకులకు చూపించింది.. అయితే సీతారామం సినిమాలో సంప్రదాయ పద్ధతిలో కనిపించిన ఆమెను… కురచ దుస్తుల్లో ఆమెను పోల్చుతూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మృణాల్ ను చూస్తూ నానీ ఇబ్బంది పడుతున్న తీరు ఆకట్టుకుంటున్నది.

    Tags