NTR Car : ‘ఆర్ఆర్ఆర్’ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్లలో చాలా బిజిబిజీగా దేశమంతా గడుపుతుంటే.. ఇక్కడ హైదరాబాద్ లో ఆయన కారును పోలీసులు పట్టుకోవడం కలకలం రేపింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో జూనియర్ ఎన్టీఆర్ కారు దొరికిపోయింది.

హైదరాబాద్ లో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కరున్న కారు ఒకరిని చంపి ముగ్గురిని గాయాల పాలు చేయడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. తాజాగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కార్లకు నకిలీ స్టిక్కర్లు, ఎమ్మెల్యే స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్ములతో తిరుగుతున్న కార్లను గుర్తించి వారికి చలానాలు విధించారు. మరికొందరికీ స్టిక్కర్లను తొలగించారు. ముఖ్యంగా బ్లాక్ ఫిల్ములతో ప్రయాణించే వారిని గుర్తించి వారి వాహనాలకు కూడా నల్ల స్టిక్కర్ ను తొలగించారు.
Also Read: BJP Politics: కేసులు, పెగాసస్.. జగన్, చంద్రబాబులను ఏపీ రాజకీయాల నుంచి బీజేపీ సాగనంపబోతోందా?
తాజాగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు జరిపారు. బ్లాక్ ఫిల్ములు, స్టిక్కర్ల వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కు చెందిన కారుకు బ్లాక్ ఫిల్మును పోలీసులు గుర్తించారు. ఆ కారును ఆపి బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. ఆసమయంలో ఎన్టీఆర్ ఆ కారులో లేరు. డ్రైవర్ తోపాటు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు, మరో వ్యక్తి ఉన్నాడు.
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కారులో ప్రయాణిస్తున్నవారు స్పష్టంగా కనిపించాల్సిందేనని.. బ్లాక్ ఫిల్మ్ కోటింగ్ ఉన్న అద్దాలు అమర్చడం నిబంధనలకు విరుద్ధం అన్న సంగతి తెలిసిందే.
జూబ్లీహిల్స్ లో ఇటీవల బోధన్ ఎమ్మెల్యే పేరిట స్టిక్కర్ ఉన్న వాహనం యాక్సిడెంట్ చేసి ఒకరిని బలిగొంది. ముగ్గురు గాయపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే కుమారుడే ఈ పనిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా నకిలీ స్టిక్కర్లు వేసుకొని తిరిగే వారిని చెక్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్ వాహనం కూడా బ్లాక్ ఫిల్మ్ లతో కనిపించింది. ఈ క్రమంలోనే దానికి పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. సెలబ్రెటీలు బయటకు వచ్చినప్పుడు కనిపించకుండా ఇలా బ్లాక్ ఫిల్మ్ ను తమ వాహనాల అద్దాలపై వేసుకుంటారు. కానీ అది నిబంధనలకు విరుద్ధం కావడంతో పోలీసులు తీసేశారు.
Also Read: AP Politics: ఆ బ్రాండ్స్ తెచ్చింది చంద్రబాబే.. కౌంటర్లు వేస్తున్న వైసీపీ..