
RGV Birthday: ఊరందరిది ఒకదారి రామ్ గోపాల్ వర్మది మరొక దారి. ఆయన ఇతరుల మాదిరి ఆలోచించరు. పండుగలు వచ్చినప్పుడు జనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు రోజూ పండగే అంటాడు వర్మ. కాగా ఏప్రిల్ 7న రామ్ గోపాల్ వర్మ బర్త్ డే. ఆయన అభిమానులు ఆయన్ని విష్ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. వారి ఆశల మీద వర్మ నీళ్లు చల్లాడు. మీ పనికిమాలిన బర్త్ డే విషెస్ నాకు అవసరం లేదన్నట్లు ఓ కామెంట్స్ పోస్ట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ కామెంట్ కచ్చితంగా ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టేదే.
‘రేపు నా పుట్టినరోజు. ఎవరూ నాకు శుభాకాంక్షలు చెప్పొద్దు. మీ ఉచిత శుభాకాంక్షలు నాకు అవసరం లేదు. ఛీప్ గిఫ్ట్స్ తో నేను హ్యాపీ. ఉచిత శుభాకాంక్షలు కంటే కూడా చీప్ గిఫ్ట్స్ బెటర్ కదా… అని ట్వీట్ చేశాడు. వర్మ ట్వీట్ వైరల్ అవుతుంది. సరే మహా ప్రభో మీకు శుభాకాంక్షలు చెప్పమంటూ ఆయన ట్వీట్ కి కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా వర్మ పుట్టినరోజు మీద ఇదే తరహా కామెంట్స్ చేశాడు. పుట్టడం పెద్ద విషయమా? ప్రతి నిమిషం ప్రపంచంలో ఎవడో ఒకడు, ఎక్కడో ఒక చోట పుడతాడు.
మనిషి పుట్టుకకు ఆడా మగా కలిస్తే చాలు అదేమైనా ఘనకార్యమా? తన మార్కు ఫిలాసఫి చెప్పాడు. ఈసారేమో చిన్నదైనా పర్లేదు గిఫ్ట్స్ ఇవ్వండి. ఖర్చు లేకుండా చెప్పే శుభాకాంక్షలు అవసరం లేదన్నారు. మరి వర్మ రిక్వెస్ట్ ని అభిమానులు, ప్రముఖులు ఎలా తీసుకుంటారో చూడాలి. కాగా ఇటీవల వర్మ ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఏపీ రాజకీయాలను ఉద్దేశిస్తూ ఓ మూవీ చేయనున్నట్లు వెల్లడించారు.

వర్మ మూవీ సీఎం జగన్ కి ఫేవరెట్ తీస్తున్నాడనే వాదన ఉంది. ఆయన కూడా తరహా హింట్స్ ఇచ్చాడు. అయితే ఈ ప్రాజెక్ట్ దిశగా ఆయన అడుగులేసిన దాఖలాలు లేవు. ప్రకటన చేసి చాలా కాలం అవుతుంది. మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. 2024 ఎన్నికలు టార్గెట్ గా వర్మ మూవీ ఉంటుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు దేశం మెచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ… ప్రస్తుతం అడల్ట్ కంటెంట్, కాంట్రవర్సీ చిత్రాలు చేస్తూ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Tmrw the 7 th is my happy birthday..Please don’t wish me ..That’s because wishes are free and useless ..I am ok with cheap gifts ..CHEAP is better than FREE
— Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2023