Homeక్రీడలుKavya Maran: సన్ రైజర్స్ కావ్య మారన్ స్టేడియంలో చేసిన ఈ పని వైరల్

Kavya Maran: సన్ రైజర్స్ కావ్య మారన్ స్టేడియంలో చేసిన ఈ పని వైరల్

Kavya Maran
Kavya Maran

Kavya Maran: సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు శుక్రవారం మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు మరోసారి ఓటమిపాలయ్యింది. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన హైదరాబాద్ జట్టు యజమాని కావ్యా మారన్ ఆద్యంతం జట్టును ఉత్సాహపరిచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో హైదరాబాద్ జట్టు రెండోసారి ఓటమిపాలైంది. శుక్రవారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. జట్టుకు కొత్త కెప్టెన్ మర్క్రమ్ వచ్చినా.. జట్టు ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై లక్నో బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ జట్టు స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. ప్రతి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో మరో నాలుగు ఓవర్లు ఉండగానే విజయం సాధించింది.

కైల్ మేయర్స్ ఔట్ కావడంతో.. మారన్ రచ్చరచ్చ..

హైదరాబాద్ గట్టు నిర్దేశించిన 122 పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన లక్నో జట్టు ఓపెనర్లు మేయర్స్, రాహుల్ ధాటిగానే ఆరంభించారు. మొదటి ఓవర్ లోనే 13 పరుగులు భువనేశ్వర్ కుమార్ సమర్పించుకున్నాడు. అయితే, అందరి కళ్ళు మేయర్స్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ కు ముందు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ మేయర్స్ అర్థ సెంచరీలు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో 38 వంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సులు, రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 50 పరుగులు తేడాతో విజయం సాధించింది. అలాగే చెన్నై తో జరిగిన రెండో మ్యాచ్ లోనూ మేయర్స్ 22 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో రెండు సిక్సులు, 8 ఫోర్లు బాదాడు మేయర్స్. అయితే, ఈ మ్యాచ్ లో లక్నో 12 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోను అందరి కళ్ళు మేయర్స్ పైనే ఉన్నాయి. అందరి మాదిరిగానే ఆ జట్టు యజమాని కావ్య మారన్ కూడా మేయర్స్ గురించి ఆందోళన చెందుతూ కనిపించారు. అయితే, 13 పరుగులు వద్ద ఫారుఖి బౌలింగ్ లో మయాంక అగర్వాల్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. మేయర్ అవుట్ అయిన వెంటనే కావ్యా మారన్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. డాన్స్ చేస్తూ చేతులు విసురుతూ మేయర్స్ పూర్తిగా ఎంజాయ్ చేసింది. మ్యాచ్ గెలిచినంత సంతోషాన్ని ఆమె వ్యక్తం చేస్తూ కనిపించింది. ఆమె ఆనందాన్ని అదే టైమ్ లో వీడియో గ్రాఫర్ చూపించడంతో అందరూ ఆమె సంతోషాన్ని చూశారు. మేయర్స్ క్రీజులో ఉంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో ఆమెకు తెలుసు కాబట్టి.. ఆ వికెట్ పడినప్పుడు అంత ఆనందాన్ని వ్యక్తం చేసిందని పలువురు చెబుతున్నారు.

Kavya Maran
Kavya Maran

మారని హైదరాబాద్ జట్టు రాక..

జట్టులో ప్లేయర్స్ మారుతున్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాత మాత్రం మారడం లేదు. జట్టుకు కొత్త సారథిగా మార్క్రమ్ వచ్చినప్పటికీ ప్రయోజనము లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో సారథి మర్క్రమ్ గోల్డెన్ డకవుట్ కాగా, ఓపెనర్ గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ 26 బంతుల్లో 31 పరుగులు చేయగా, మాయాంక అగర్వాల్ ఏడు బంతుల్లో 8 పరుగులు, రాహుల్ త్రిపాఠి 41 బంతుల్లో 35 పరుగులు, హారీ బ్రూక్ నాలుగు బంతుల్లో మూడు పరుగులు, వాషింగ్టన్ సుందర్ 28 బంతుల్లో 16 పరుగులు, అబ్దుల్ సమద్ పది బంతుల్లో 21 పరుగులు చేశారు. ఎవరు ఆశించిన స్థాయిలో భారీ చేయకపోవడంతో హైదరాబాద్ జట్టు స్వల్ప స్కోర్ కు పరిమితమై ఓటమిపాలైంది.

RELATED ARTICLES

Most Popular