
సాధారణంగా భార్యాభర్తకు ఎంతమంది పిల్లలు ఉంటారంటే ప్రశ్నకు ఒకరు లేదా ఇద్దరు అనే సమాధానం వినిపిస్తుంది. మరీ పిల్లలంటే ఇష్టం ఉంటే ముగ్గురు పిల్లలు ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 150 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అయితే ఆ పిల్లలు అతనికి అతని భార్యకు పుట్టిన పిల్లలు ఎంత మాత్రం కాదు. అతను వీర్యాన్ని దానం చేయడాన్ని సామాజిక సేవగా భావిస్తాడు.
సాధారణంగా దానం చేసిన వీర్యం మహిళల అండంలో ప్రవేశపెట్టి వైద్యులు పిల్లలు పుట్టేలా చేస్తారు. అయితే ఈ వీర్య దానం చేసే వ్యక్తి మాత్రం డాక్టర్లకు కూడా శ్రమ తగ్గించాలనే ఉద్దేశంతో మహిళలతో నేరుగా ఆ పని చేస్తూ వాళ్లకు పిల్లలు కలిగేలా చేస్తున్నాడు. అలా 150 మంది పిల్లలకు ఇప్పటికే తండ్రయ్యాడు. అంత మంది పిల్లలకు తండ్రైన ఆ వ్యక్తి పేరు జోయ్ డోనర్. ఇతని పేరు మనకు పెద్దగా తెలియకపోయినా అమెరికా మాత్రం బాగా సుపరిచితం.
సాధారణంగ కరోనా మహమ్మారి విజృంభణ వల్ల లాక్ డౌన్ అమలుతో చాలామంది ఇళ్లకు పరిమితమయ్యారు. అయితే ఈ వ్యక్తి మాత్రం లాక్ డౌన్ సమయంలో కూడా పని కానిచ్చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం జోయ్ వయస్సు 49 సంవత్సరాలు. మరో ఆరుగురిని జోయ్ గర్భవతులను చేయగా వాళ్లకు డెలివరీ కావాల్సి ఉంది. సంవత్సరానికి కనీసం పది మంది పిల్లలకు తండ్రి కావడమే తన లక్ష్యమని జోయ్ చెబుతున్నాడు.
తన పోలికలతో పుట్టే పిల్లలను చూసిన సమయంలో కలిగే సంతోషం అంతాఇంతా కాదని.. తనకు 2,500 మంది పిల్లలకు తండ్రి కావాలనే ఆశ ఉన్నా అది సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నాడు. తనలో వీర్యం ఉన్నంతవరకూ డబ్బులు తీసుకోకుండా దానం చేస్తూ ఉంటానని జోయ్ చెప్పడం గమనార్హం.